సంచలనం రేపుతున్న ఐశ్వర్యారాయ్ ఇంస్టాగ్రామ్ పోస్ట్…. మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
78
ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్‌ ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన ఫొటో అభిమానులను ఆకర్షిస్తోంది. అభిషేక్‌ చిన్ననాటి ఫొటోను షేర్‌ చేసిన ‘హ్యాపీ బర్త్‌ డే మై బేబీ’ అంటూ ఒక క్యాప్షన్‌ ఇచ్చారు. ఇక ఆమె చేసిన పోస్ట్‌ కేవలం కొన్ని గంటల్లోనే కొన్ని లక్షలకు పైగా లైకులు రావడంతో పాటు అభిషేక్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఇక అభిషేక్‌ సోదరి శ్వేతా నందా కూడా అభిషేక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వాళ్లిద్దరి చిన్ననాటి ఫొటో షేర్‌ చేశారు. కాగా బిగ్‌ బీ అమితాబ్‌, జయా బచ్చన్‌ల కుమారుడైన అభిషేక్‌ బాలీవుడ్ కి ‘రెఫ్యూజీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చారు.
Aishwarya Rai Adorable Wishes To Hubby Abhishek On His Birthday - Sakshi
ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరొకవైపు సపోర్టింగ్‌ రోల్స్‌తో ఆకట్టుకున్నారు అభిషేక్‌, ఇక వ్యాపార రంగంలోనూ అయన సత్తా చాటుతున్నాడు. ఇక ఇప్పటికే అయన ప్రో కబడ్డీ లీగ్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ జట్టు యజమానిగా, ఇండియన్‌ సూపర్‌ లీగ్‌లో చెన్నైయాన్‌ ఎఫ్‌సీ జట్టు సహయజమానిగా కొనసాగుతున్నాడు. ఇక అభిషేక్‌ బచ్చన్ 2007లో ఐశ్వర్య ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరికి ఆరాధ్య అనే కూతురు ఉంది. ఇక ప్రస్తుతం ఐశ్వర్య చేసిన పోస్ట్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here