ఫ్లాష్ న్యూస్ : జనసేనలోకి అక్కినేని నాగార్జున……మ్యాటర్ కోసం ఇది చూడండి!

0
22
కొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల ఎన్నికలు ఎంతో ఉత్కంఠ మధ్య ప్రారంభమయి చివరకు కొద్దిరోజుల క్రిందట ముగిసాయి. ఇక అక్కడ మరొక్కసారి అద్భుతమైన మెజారిటీతో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. దానితో అందరి దృష్టి త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికలపైనే వుంది. నిజానికి గత ఎన్నికల్లో టీడీపీ అక్కడ అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటికీ, రాబోయే ఎన్నికల్లో మాత్రం ఎంతమేరకు మరొక్కసారి గెలుస్తుందో ప్రస్తుత పరిస్థులను బట్టి చెప్పడం కొంత కష్టమనే చెప్పాలి. గతంతో పోలిస్తే ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి పార్టీని కొన్ని నెలలుగా ప్రజల్లోకి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో తీసుకెళ్తున్నారు వైఎస్ జగన్. ఇక మరోవైపు గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతిచ్చిన జనసేన, ఈ ఎన్నికల్లో ప్రత్యక్షంగా బరిలోకి దిగడానికి కూడా అన్నివిధాలుగా సన్నాహాలు చేస్తోంది. ఇక పవన్ కూడా మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటినుండే పర్యటనలు చేపట్టారు.
అయితే ప్రస్తుతం ఏపీ రాజకీయాలకు సంబందించిన ఒక ఫ్లాష్ న్యూస్ అటు సినీ మరియు ఇటు రాజకీయ వర్గాల్లో సంచలనముగా మారింది. అది ఏంటంటే టాలీవుడ్ సినిమా హీరో అక్కినేని నాగేశ్వర రావు గారి అబ్బాయి నాగార్జున త్వరలో జనసేన పార్టీలో చేరబోతున్నారని అంటున్నారు. నిజానికి ఈ వార్త ప్రకారం నాగార్జున జనసేనలో చేరిక విషయం కొద్దిరోజుల క్రితమే కన్ఫర్మ్ అయిందని, అయితే ఈ విషయాన్ని జనసేన పార్టీ నాయకులు మంచి సమయం వచ్చే వరకు బయటపెట్ట కూడదని భావించి గోప్యంగా వుంచారట. ఇక మెగా మరియు అక్కినేని ఫ్యామిలీల మధ్య ఎప్పటినుండో మంచి స్నేహం ఉందని, అయితే పవన్ చేస్తున్న ప్రసంగాలు, ఇస్తున్న స్పీచ్ లు మరియు ఆయన అనుసరిస్తున్న రాజకీయ విధానాలు తనకు ఎంతో నచ్చాయని నాగార్జున చెప్పారట.
అంతేకాక అవి చూసి తనకు కూడా ప్రజల్లోకి వచ్చి పవన్ తో కలిసి కొంత సేవ చేయాలనీ అనిపించిందని, అందుకే జనసేనలో చేరాలని ఉందని నాగ్ నిర్ణయించినట్లు చెపుతున్నారు. అయితే ఈ విషయమై మరొకవిధమైన సమాచారం కూడా అందుతోంది, అదేమిటంటే, నాగార్జున నిజానికి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి రాబోయే ఎన్నికల్లో ఏపీలో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తూ ప్రచారం మాత్రమే చేస్తాం అన్నారని, అయితే పార్టీలో మాత్రం చేరబోతున్నట్లు ఇప్పటివరకు తమకు నిర్ణయం వెలువరించలేదని అంటున్నారు. ఇక రెండు వార్తల్లో ఏది నిజమో ఇప్పుడే చెప్పలేకపోయినప్పటికీ, ఒకవేళ నిజమైతే మాత్రం ఆంధ్రలో ఒకరకంగా జనసేనకు మంచి బూస్ట్ లభించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.