సమంత తల్లి మృతి……శోకసంద్రంలో ఆమె ఫ్యామిలీ!

0
151
ఏం మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమైన సమంత రూత్ ప్రభు, తొలి సినిమానే సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో ఆమె క్రేజ్ విపరీతంగా పెరిగింది. నిజానికి ఆ సినిమా మంచి హిట్ అవడంలో సమంతదే కీలక పాత్ర అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఎందుకంటే కుర్రకారు ఎక్కువగా సమంతను చూడానికే ఆ సినిమాకు వెళ్లారంటే, ఆమె ఆ సినిమాలో ఎంతలా ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఆ తరువాత దాదాపుగా తెలుగు, తమిళ భాషల్లో అందరూ అగ్ర హీరోలతో నటించిన ఈ చుల్ బులి, ఇటీవల తన తొలి సినిమా హీరో నాగచైతన్యను తన జీవిత భాగస్వామిగా చేసుకుని అక్కినేని సమంతగా మారిపోయింది. ఇక సమంత పర్సనల్ లైఫ్ మరియు ఆమె చేసే సామజిక కార్యక్రమాల గురించి ఇండస్ట్రీలోని చాలా మందికి తెలుసు, ఆమె తన ప్రత్యుష ఫౌండేషన్ ద్వారా ఎందరో చిన్నారులకు ఆపరేషన్లు చేయించి వారి జీవితాలకు కొత్త వెలుగుని అందించింది  అనే చెప్పాలి. ఆ విషయం అటుంచితే, నేడు సమంత జీవితంలో ఓకే బ్లాక్ డే అని చెప్పాలి, ఎందుకంటే సమంతకు చిన్నప్పటినుండి ఎంతో ఇష్టమైన టీచర్ సెలియా జోసెఫ్ ఇక లేరని తెలిసి ఆమె గుండెలు పగిలేలా ఏడ్చిందట.
ఇక ఇటీవల ఒక టివి షోలో పాల్గొన్న సమంత, యాంకర్ ప్రదీప్, సమంత తన టీచర్ సెలియా తో కలిసి సందడి చేసిన ఒక వీడియోని చూపించగానే సమంత ఒక్కసారిగా ఆవేదనకు గురై కొంత కన్నీరు పెట్టింది. తనకు సెలియా మేడం ఒక టీచర్ కాదని, ఒక అమ్మ వంటిదని, తాను చిన్నపుడు చెన్నైలోని ఆంగ్లో ఇండియన్ హయ్యర్ సెకండరీ స్కూల్ లో చదివినపుడు ఆ టీచర్ తో ఎంతో అనుబంధం ఉండేదని, ఇక ఆమె నేడు అకాల మరణం చెంది మనందరికీ దూరమైనందుకు తనకు ఎంతో వేదనగా ఉందని, ఆమె ఆత్మకు ఆ భగవంతుడు శాంతిని అందించాలని కోరుకుంటున్నట్లు సమంత తన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here