పవన్ నాకు డబ్బు ఇచ్చారా ? అవకాశాలు ఇప్పించారా ? : అలీ

0
28
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్నప్రచారం లో భాగంగా  రాజమండ్రి లో  కమెడియన్ అలీ పై కొన్ని వ్యాఖ్యలు చేశారు . అలీ ఎందుకు వైసీపీ లో చేరారో ఇప్పటి వరకు తనకు తెలియదని ఆ,అలీ పరిచయం చేసిన వ్యక్తికే నేను ఎంపీ టికెట్ ఇచ్చానని అయినా నాస్నేహితుడనుకున్న అలీ వైసీపీ లో చేరడం నన్ను చాలా బాధించిందని చెప్పుకొచ్చారు పవన్ .
ఈ విషయం పై స్పందించిన  అలీ ఇలా చెప్పుకొచ్చారు . పవన్ కళ్యాణ్ గారంటే నాకు చాలా గౌరవం కానీ నిన్న అయన చేసిన వ్యాఖ్యలు నన్ను చాలా బాధించాయి . నేను ఏ పార్టీ లోనైనా చేరే స్వేచ్ఛ నాకు ఉంది. పవన్ కళ్యాణ్ చిరు బాటలో వచ్చారు కానీ నేను మాత్రం ఎలాంటి బాగ్ గ్రౌండ్ లో రాలేదని నాకు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా  డబ్బు సహాయం చేశారా ? లేక నాకేమైనా అవకాశాలు ఇప్పించారా?  అని పవన్ కళ్యాణ్ రాకముందే నేను మంచి స్థానం లో ఉన్నానని . రాజమండ్రిలో   నా గురించి చెప్పడంచాలా బాధేసిందని చెప్పుకొచ్చారు .
 నేను పరిచయం చేసిన వ్యక్తిని రాజమండ్రిలో నిలబెట్టారు . నాకు చెప్పి నిర్ణయం తీసుకున్నారా అని తెలిపారు . ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ గారు అలా చెప్పడం తప్పని నాకు అవకాశాలు లేక పోతే నేను వేరే వ్యక్తి దగ్గర వెళ్లి చెయ్యి చాచి అడుక్కునే పరిస్థితి వస్తే అప్పుడు అలీ భూమి మీద ఉండడు  అని చెప్పారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here