ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అల్లు అర్జున్, అర్హల వీడియో!

0
78
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాని అయన తండ్రి అల్లు అరవింద్ మరియు హారిక హాసిని సంస్థ నిర్మాత రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుండడంతో, ప్రస్తుతం అర్జున్ తన ఫ్యామిలీ తో హ్యాపీగా గడుపుతున్నారు. ఇక కాసేపటి క్రితం ఆయన తన కూతురు అర్హ తో కలిసి మాట్లాడుతున్న ఒక వీడియోని కొందరు యూట్యూబ్ లో అప్ లోడ్ చేసారు.
Image result for allu arjun and arha
ఆ వీడియోలో నేను నాన్న చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను అని అర్జున్ అనడం, అదే మాటను అర్హ రిపీట్ చేస్తూ, చివర్లో మాత్రం చేసుకోను అనడం, ఆపై అర్జున్ చేసుకోను కాదు… చేసుకుంటాను అని అనడం… వంటి మాటలతో వీడియో తండ్రి కూతుళ్ళ మధ్య మంచి ఫన్నీగా సాగుతుంది. ఇక వీడియో పలు సోషల్ మీడియా వేదికల్లో వైరల్ అవుతుండడంతో, పలువురు బన్నీ ఫ్యాన్స్ దానిని చూసి ఎంజాయ్ చేస్తూ మురిసిపోతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here