బ్రహ్మానందాన్ని పరామర్శించిన బన్నీ……. వైరల్ అవుతున్న న్యూస్!

0
73
టాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ఇటీవల ఛాతిలో నొప్పికారణంగా హాస్పిటల్ లో జాయిన్ అవడం, తర్వాత ఆయనకు నొప్పి మరింత ఎక్కువ కావడంతో ఆయనను ముంబైలోని ఏషియన్ ఆసుపత్రికి షిఫ్ట్ చేసి అక్కడ హార్ట్ సర్జరీ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సర్జరీ అనంతరం నాన్నగారు బాగానే వ్నన్నారు, అభిమానులెవరూ కంగారుపడవలసిన అవసరం లేదని అయన తనయుడు గౌతమ్ కొద్దిరోజుల క్రితం ఒక పత్రిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే నేడు హైదరాబాద్ లోని అయన స్వగృహంలో బ్రహ్మానందాన్ని, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కలిసి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన అర్జున్, అయన మునుపటి వలె ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా వున్నారని, ఇక రాబోయే రోజుల్లో మళ్ళి సినిమాల్లో నటించి మనల్ని అందరిని నవ్వించాలి అని కోరుకుంటూ అభినందనలు తెలిపినట్లు చెప్పారు. ఇక తనను చూడడానికి బన్నీ రావడం చాల సంతోషం అని, తెలుగు ప్రజల దీవెనలు, ఆశీర్వాదాలు వల్లనే తాను త్వరగా కోలుకున్నానని బ్రహ్మానందం అన్నారు. ఇక ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here