మెగాస్టార్ ‘సైరా’లో అల్లు అర్జున్ పాత్ర అదేనా?

0
45
ఇటీవల ఖైదీ నెంబర్ 150 సినిమా సూపర్ హిట్ తరువాత, అయన సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో  చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం ప్రస్తుతం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే లాంగ్ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను మరియు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్రబృందం. అయితే కొంతమంది సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలోని ఓ కీలక యోధుడి పాత్రలో బన్నీ కూడా నటించనున్నట్లు చెప్తున్నారు.
Related image
అయితే దీనిపై చిత్ర బృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.  ఇక ఈ చిత్రంలో సుదీప్, అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, జగపతిబాబు వంటి స్టార్ లు నటిస్తున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా నటిస్తే.. సినిమా పై ఇంకా అంచనాలు పెరుగుతాయి. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది.  భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రం స్వతంత్ర దినోత్సవ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ సినిమాలో బన్నీ నటిస్తున్నన్నాడు అనే వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here