నేను స్టిల్ యంగ్ అన్న అల్లుఅర్జున్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన స్నేహ రెడ్డి!

0
98
 ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా తనకంటూ కొంత ప్రత్యేక ఇమేజిని సంపాదించి కేవలం టాలీవుడ్ లోనే కాక, అటు కోలీవుడ్, మోలీవుడ్ లో కూడా తన యాక్షన్ మరియు డాన్సింగ్ స్టైల్ తో ఎందరో అభిమానులను సంపాదించి ముందుకు దూసుకెళ్తున్న స్టార్ అల్లు అర్జున్. మొదటినుండి బన్నీ ఎంత ఎదిగినా కూడా వొదిగి వుండే వ్యక్తి అనే పేరు సంపాదించాడు. ఇక తనకు నచ్చిన ఏవైనా సినిమాలు రిలీజ్ అయితే వాటికీ తనవంతు మద్దతుగా నిలిచి ప్రచారం చేసే బన్నీకి అయన అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికల్లో ఆయనకు బాసటగా నిలిచి తమవంతు సాయం అందిస్తుంటారు. ఇక ఇటీవల యూట్యూబ్ లో విడుదలైన శర్వానంద్ మరియు సాయి పల్లవి నటించిన పడిపడి లేచే మనసు ట్రైలర్ ని ఇటీవల తనకు తెలిసినవారు కొందరు చూడమని వాట్సాప్ లో షేర్ చేసి, ఈ ట్రైలర్ మీకు తప్పకుండ నచుతుంది చూడండి అని చెప్పారట.
అయితే వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఆ ట్రైలర్ చూసిన తనకు నిజంగా చాలా ఆశ్చర్యం వేశిందని, ట్రైలర్ సూపర్బ్ గా ఉందని బన్నీ కితాబిచ్చారు. కాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు నిన్న స్పెషల్ గెస్ట్ గా విచ్చేసిన బన్నీ ఈ వ్యాఖ్యలు చేసారు. ఇక అయన మాట్లాడుతూ తనకు శర్వానంద్ అంటే ఇష్టమని, అలానే సాయిపల్లవితో కలిసి ఒక సినిమాలో డాన్స్ చేయాలనీ ఆశిస్తున్నట్లు తెలిపారు. ఇక ఈ ఈవెంట్ లో మాట్లాడిన బన్నీ మాటల మధ్యలో తనకు ప్రేమకథలు అంటే చాలా ఇష్టమని చెప్తుండగా హాల్ మొత్తం ఈలలు గోలలతో మారుమ్రోగింది, ఆ సమయంలో బన్నీ ఏంటి అరుస్తున్నారు…! ఎంత పెళ్ళి అయినా కానీ తాను ఇంకా యంగ్ అని, దానిని ఇంద్ర సినిమా స్టయిల్లో చెప్పాలంటే, పెళ్ళైనా తనలో వుంది అదే యంగ్ బ్లడ్, అదే యూత్ స్టైల్ అని చెప్పి అందరిని నవ్వులతో ముంచెత్తాడు.
ఇక ఈ విషయమై అయన భార్య స్నేహ మాట్లాడుతూ, నిజంగా బన్నీ ఎపుడు యంగే అని, అయన ఎప్పుడు కూడా తన ఫిజిక్ ని ఎప్పటికపుడు వర్క్ అవుట్స్ చేస్తూ జాగ్రత్తగా కాపాడుకుంటారని, అంతేకాక అయన ఆలోచనలు కూడా ఎంతో వేగంగా పరుగెడుతూ అన్నింటా ముందుకు దూసుకెళ్లేలా చేస్తాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here