వింత వ్యాధితో బాధపడుతున్న స్టార్ హీరో….. ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
110
బాలీవుడ్ బిగ్ బీ గా పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ ను బాలీవుడ్ మెగాస్టార్ అని కూడా అంటారు. ఇక దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు కోట్లాదిమంది అభిమానులు వున్నారు. ఇక మన తెలుగులో కూడా అమితాబ్ కు మంచి పేరుందని చెప్పాలి. అయితే అమితాబ్ పై కొన్నేళ్ల క్రితం ఒక సినిమా షూటింగ్ సమయంలో ఫైట్ సీన్ తీస్తుండగా ఆ సమయంలో ఒక ఫైటర్ ఆయనను కొట్టాల్సి వుంది, ఇక డైరెక్టర్ షాట్ ఓకే అనగానే ఆ ఫైటర్ అనుకోకుండా నిజంగానే అమితాబ్ పొట్టలో గుద్దడంతో అయన ఒక్కసారిగా కడుపునొప్పితో మెలికలు తిరిగిపోయారు. ఆ తరువాత ఆయనకు 24గంటల కడుపునొప్పి ఆపరేషన్ కూడా జరిగింది. ఇక ఆ సమస్య ఇప్పటికీ ఆయనకు తగ్గలేదని అమితాబ్ అప్పుడపుడు చెపుతుంటారు. ఇకపోతే దేశవ్యాప్తంగా పేరుగాంచిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం కి మొదట ఇండియాలో హోస్ట్ గా బాధ్యతలు స్వీకరించిన అమితాబ్, ప్రస్తుతం ఆ షో 10వ సీజన్ కు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల ఆ షోలో భాగంగా ఆయన మాట్లాడిన మాటలకు కేవలం షోలోని వారే కాదు, ప్రపంచవ్యాప్తంగా షో చూస్తున్న ప్రేక్షకులందరూ కూడా షాక్ లో ఉండిపోయారు.
ఇక ఆ షోలో పార్టిసిపెంట్ గా వరుసగా ప్రశ్నలకు సమాధానం ఇస్తూ దూసుకెళ్తున్న కాజల్ అనే అమ్మాయి, మిమ్మల్ని ఇప్పటివరకు శారీరకంగా ఎక్కువగా ఇబ్బందిపెట్టిన ఘటన ఏదైనా ఉందా అని అడిగిన ఒక ప్రశ్నకు అమితాబ్ సమాధానమిస్తూ, నేను ఇటీవల విపరీతమైన వెన్నునొప్పితో బాధపడ్డాను, అయితే అందునిమిత్తం హాస్పిటల్ కు వెళ్ళి చికిత్స చేయించుకుంటున్న సందర్భంలో, నాకు కొన్ని టెస్టులు చేసిన డాక్టర్లు నా వెన్నుపూసలో ఒకరకమైన కాన్సర్ కారకాన్ని కనుగొన్నారు. అయితే అది ప్రస్తుతం బిగినింగ్ స్టేజిలో ఉందని, ఇప్పటినుండే మంచి మందులు తీసుకుంటే ఇకపై అది మరింత పెద్ద సమస్యగా మారె అవకాశం ఉండదని సలహా ఇవ్వడంతో దానికి మందులు తీసుకుంటున్నారట. అయినప్పటికీ ఒక్కోసారి తాను ఆ బాధవల్ల కనీసం కుర్చీలో కూర్చోవడం కూడా కష్టమయ్యేదని, అటువంటి బాధ పగవాడికి కూడా రాకూడదని అమితాబ్ చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయాన్ని విన్న అమితాబ్ అభిమానులు సర్, మీరు త్వరగా ఆ వ్యాధినుండి కోలుకుని మళ్ళి మా అందరిముందుకు ఆనందంగా రావాలి అని కోరుకుంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here