అనసూయ పై మండిపడుతున్న సావిత్రి ఫ్యాన్స్….మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
192
బులితెరపై ప్రస్తుతం మంచి పేరు మరియు క్రేజ్ తో దూసుకెళ్తున్న యాంకర్లలో అందరికంటే ముందుగా గుర్తుకువచ్చే పేర్లు అనసూయ, రష్మీ అనే చెప్పాలి. నిజానికి ఒకప్పటి యాంకర్ సుమ ఉన్నప్పటికీ, ఆమె ఎక్కువగా గ్లామర్ ఆధారిత ప్రోగ్రామ్స్ చేయడం లేదు, ఇక కుర్రకారుకు మంచి హుషారునివ్వడానికి పలు టెలివిజన్ ఛానల్స్ వారు ఎక్కువగా వీరిద్దరివైపే మొగ్గుచూపుతున్నారు. ఇకపోతే వీరిద్దరూ ఈటివి ఛానల్ లో ప్రసారమైన జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారానే పాపులరయ్యారు అనే విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం అనసూయ చేసిన ఒకపనికి వెండితెర మహానటి, దివంగత సావిత్రి గారి అభిమానులు విపరీతంగా మండిపడుతున్నారు. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే, నేడు అనసూయ మరియు సింగర్ మనో ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ వస్త్రాభరణాల వ్యాపార సంస్థ చందన బ్రదర్స్ వారు ఒక యాడ్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు. ఇక ఈ యాడ్ లో అనసూయ మాయాబజార్ సినిమాలో సావిత్రి పోషించిన శశిరేఖ పాత్రలో, అహనా పెళ్లి అంట అనే పాట స్పూఫ్ లో నటించారు.
ఇక ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకెళ్తోంది. ఇంతవరకు బాగానేవున్నా, ఇక్కడే ఒక సమస్య వచ్చింది. ఈ యాడ్ చూసిన కొందరు సావిత్రి గారి అభిమానులు, ఈ యాడ్ చూస్తుంటే సావిత్రి గారిని అవమానించినట్లుందని, అసలు శశిరేఖ పాత్రలో ఇటీవల కీర్తి సురేష్ మాత్రమే సూటయ్యారని, ఇక ఇప్పుడు అనసూయ ఆమె పాత్రలో నటించి ఏ మాత్రం మెప్పించలేకపోయిందని విమర్శిస్తున్నారు. ఈ యాడ్ లో అనసూయను చూస్తుంటే ఒక వ్యాంపు పాత్రధారిణితో సావిత్రి గారి పాట చేయించి అవమానించినట్లుందని, అసలు ఆ పాత్రలో అనసూయ ఏ మాత్రం సెట్ కాలేదని కొందరు సావిత్రి అభిమానులు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here