హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న అనసూయ చెల్లెలు…. చూస్తే ఆశ్చర్యపోతారు!

0
103
అటు బుల్లి తెరపైనే కాక ఇటు వెండి తెరపై కూడా తన అదరగొట్టే పెర్ఫార్మన్స్ తో ఆడియన్స్ ని కట్టిపడేస్తున్న యాంకర్ కమ్ నటి అయిన అనసూయ. ఇక కొన్నేళ్ళక్రితం భరద్వాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లిచేసుకున్న అనసూయ కు ప్రస్తుతం ఒక కూతురు మరియు ఒక కొడుకు. పిల్లలు పుట్టినప్పటికీ కూడా అనసూయ మంచి ఫిజిక్ మెయింటెయిన్ చేస్తూ, ఇప్పటికీ కుర్రకారును హుషారెత్తిస్తున్నారు. ఇక అనసూయ స్పూర్తితో ఆమె సోదరి వైష్ణవి త్వరలో సినిమాల్లోకి రంగప్రవేశం చేయనున్నట్లు కొన్ని టాలీవుడ్ వర్గాల సమాచారం. నిజానికి చూడడానికి చాలావరకు అనసూయను పోలి వుండే వైష్ణవిని ఇదివరకు అనసూయతో కలిసి చూసిన కొందరు నిర్మాతలు మీ చెల్లెలు అచ్చం మీలానే వుంది, సినిమాల్లోకి తీసుకువస్తే మంచి లైఫ్ ఉంటుంది అని సలహా ఇచ్చారట. ఇక అప్పటినుండి ఆమెను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుందట అనసూయ.
అంతేకాదు తనకు తెలిసిన నిర్మాతలు మరియు దర్శకుల వద్దకు తన చెల్లెలిని తీసుకెళ్లి పరిచయం చేస్తోందట. అయితే ఇటీవల వైష్ణవిని చూసిన ఒక దర్శకుడు తాను త్వరలో చేయబోయే సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకోవాలని నిర్ణయించాడట. ఈ విషయమై ఇటీవల అనసూయను సంప్రదించగా ఆమె తన తల్లితండ్రులకు చెప్పి వారిని కూడా ఒప్పించిందట. అయితే నిజానికి ఆ దర్శకుడు మరియు సినిమా చిన్నవే అయినప్పటికీ, మొదటి సినిమానే కాబట్టి ఒకవేళ ఆ సినిమా సక్సెస్ అయితే వైష్ణవికి మంచి భవిష్యత్తు ఉంటుందని, ఆపై మెల్లగా అవకాశాలు అవే వస్తాయని భావిస్తోందట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మరి సంచలనం సృష్టిస్తోంది. కాగా కొందరు నెటిజన్లు వెల్కమ్ తో సినిమా వైష్ణవి గారు అంటూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here