ఇకపై జబర్దస్త్ కు రానంటూ అనసూయ సంచలన ప్రకటన…మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతారు!

0
113
ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న షోల్లో మంచి రేటింగ్స్ సంపాదిస్తున్న వెరైటీ షో జబర్దస్త్. ఇక ఈ షోలో అనసూయ తన అద్భుతమైన యాంకరింగ్ తో మంచి పేరు సంపాదించారు. అయితే అక్కడినుండి ఆమెకు ఆఫర్లు విపరీతంగా పెరిగాయి, అంతటితో ఆగకుండా ఆమెకు సినిమా అవకాశాలు రావడం కూడా మెల్లగా మొదలయ్యాయి. ఇక ఒకరకంగా ఆ షో మంచి సక్సెస్ కావడానికి యాంకర్లు అనసూయ మరియు రష్మిలు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఇక రాబోయే కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని నిన్న ఈటివి వారు ప్రసారం చేయబోయే కొత్త షో ఎవడిగోల వాడిది. ఇక ఈ షోలో జబర్దస్త్ మరియు ఢీ జోడి ప్రోగ్రామ్స్ లోని పార్టిసిపెంట్స్ మరియు యాంకర్స్ అందరూ పాల్గొంటున్నారు. అయితే ఈ షోకి సంబంధించి నిన్న ప్రోమో యూట్యూబ్ లో విడుదలయింది.
అయితే ప్రోమోలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, భాసుశ్రీ, రష్మీ, రాజమౌళి, సన్నీ తదితరులు తమ పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నారు. అయితే ఈ ప్రోమోలో అనసూయ కనపడలేదు, ఇక కొందరు ఆ ఛానల్ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఎవడిగోల వాడిది షోకి అనసూయ రాలేదని అంటున్నారు. నిజానికి అనసూయను ఈ షోకి పిలవలేదని, అందువల్ల కొంత నొచుకున్న ఆమె, ఇకపై ఆ ఛానల్ వారి ఇతర షోల్లో కూడా పాల్గొనలేను అంటూ గట్టిగా తేల్చి చెప్పిందట. నిజానికి రష్మీ తో పాటు తనకు కూడా మంచి పేరుందని, కానీ ఆ ప్రోగ్రాం కి తనను అహ్వాహించకపోవడం వల్లనే ఇదంతా జరిగిందని అంటున్నారు. అయితే ఈ వార్తలో నిజమెంతవరకు ఉందొ తెలియాలంటే మరికొద్దిరోజుల్లో ఆగవలసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here