వరుణ్ తేజ్ బర్త్ డే కు అనసూయ ఇచ్చిన సర్ ప్రైజ్ ఏంటంటే?

0
92

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ముకుంద సినిమాతో టాలీవుడ్ కి హీరోగా అరంగేట్రం చేసిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, ఆ తరువాత చేసిన సినిమాలు పర్వాలేదనిపించాయి. ఇక కొన్నాళ్ళకు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ఫిదా తో అయన మంచి కమర్షియల్ సక్సెస్ అందుకున్నారు. ఇక గత సంవత్సరం తొలిప్రేమ, అంతరీక్షం సినిమాలు ఆయనకు మంచి విజయాన్ని అందించాయి.

ఇకపొతే నేడు పుట్టిన రోజు జరుపుకున్న వరుణ్ కు మెగా అభిమానులతో పాటు కొందరు సినీ ప్రముఖులు కూడా తమ సోషల్ మీడియా వేదికల్లో బర్త్ డే విషెస్ చెపుతున్నారు. కాసేపటిక్రితం యాంకర్ మరియు నటి అయిన అనసూయ, తన ట్విట్టర్ ద్వారా వరుణ్ కు బర్త్ డే విషెస్ చెపుతూ ఆయనతో కలిసి దిగిన ఒక ఫోటో పెట్టింది. హ్యాపీ బర్త్ డే వరుణ్, మీరు భవిష్యత్తులో మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నట్లు ఆమె తన పోస్ట్ ద్వారా తెలిపింది. కాగా ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here