ఆనీ మాస్టర్ కొడుకుని చూస్తే ఆశ్చర్యంవేయకమానదు…. !

0
138
ఓవైపు సినిమాల్లో డాన్స్ మాస్టర్ గా పలు సినిమాలకు అద్భుతమైన కొరియోగ్రఫీ అందిస్తున్నఆనీ మాస్టర్, మరోవైపు టివి షోల్లో కూడా తన హవా కొనసాగిస్తున్నారు. ఇకపోతే ఆమె ఈటివి ఛానల్ లో ప్రదర్శితమవుతున్న ప్రముఖ డాన్సింగ్ షోలో ఢీ ప్రోగ్రాం కు ఎప్పటినుండో జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆనీ మాస్టర్ అసలు పేరు అనిత లామా, ప్రస్తుతం ఢీ కి సీక్వెల్ గా ప్రసారమవుతున్న ఢీ జోడి లో కూడా ఆమె ప్రియమణి, శేఖర్ మాస్టర్ తో కలిసి మరొక జడ్జిగా వ్యవహరిస్తున్నారు. అయితే మొదటినుండి మంచి చలాకీగా వుండే ఆని మాస్టర్, తన జీవితంలో తన కొడుకే సర్వస్వము అని చెపుతుంటారు. నిజానికి తనకు జన్మనిచ్చిన తల్లితండ్రుల తరువాత ఆ భగవంతుడు నాకు ప్రసాదించిన వరం నా కొడుకే అని ఆమె ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు. తన జీవితంలో ఎన్నో ఒడిడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చానని, ఎందరో మహానుభావులు నేను ఈ రోజున ఈ స్థాయిలో ఉండడానికి నాకు అవకాశాలు ఇచ్చి ప్రోత్సహించడమే కారణం అని ఆమె చెప్పారు.
ఇకపోతే ఆమె కొడుక్కి నటన అన్నా, డాన్స్ అన్నా విపరీతమైన అభిమానమట. అందుకే అతడికి చిన్నప్పటినుండి ఆనీ మాస్టర్ మంచి శిక్షణ కూడా ఇప్పిస్తున్నారట. అంతేకాక ఆ అబ్బాయి ఇటీవల ఒక ఫేమస్ తెలుగు సీరియల్లో ఒక మంచి క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించాడట. ఆ సీరియల్లో తన కుమారుడి  నటనకు ఫిదా అయిన ఆనీ మాస్టర్, రాబోయే రోజుల్లో అతనికి మరింత తర్ఫీదు ఇప్పించి ఆపై సినిమాల్లోకి తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నారట. అయితే ప్రస్తుతానికి కొడుకుది చిన్న వయసని, ప్రస్తుతం నటన, డాన్స్ కంటే చదువుపైనే ఎక్కువ ద్యాస పెట్టాలని కొడుక్కి చెప్పారట. మరింత యుక్త వయసుకురాగానే పూర్తి స్థాయిలో నటనపై దృష్టి పెట్టవచ్చని చెప్పారట. ఇక ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here