భారతీయుడు – 2 లో నటించే మరొక బ్యూటీ ఈమె..!!!

0
105
గత కొద్దిరోజులుగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న దర్శకుడు శంకర్, ఇటీవల రజినీకాంత తో తీసిన 2.0 అద్భుత విజయంతో మళ్ళి లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇక ప్రస్తుతం అయన కమల్ హాసన్ తో ఒకప్పుడు సూపర్ హిట్ కొట్టిన భారతీయుడు సినిమాకు రెండవ భాగమైన భారతీయుడు-2 ని తీయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ఈనెల 18 నుంచి సెట్స్ పైకి వెళుతోంది. రామోజీ ఫిలింసిటీ,చెన్నయ్, కొరియా, బ్యాంకాక్, థైవాన్ లోని అద్భుతమైన లొకేషన్లలో ఈ సినిమాని తెరకెక్కించేందుకు శంకర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఈ సినిమా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుందని సమాచారం. ఇక ఈ సినిమాని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది…
ఇక ఈ సినిమాలో కథానాయికగా అందాల చందమామ కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ కొన్ని ఫైట్ సీన్స్ లో కూడా నటించనుందట. తన పాత్ర కోసం అవసరం మేర కళరియపట్టు అనే కేరళ విద్యను కాజల్ ఇప్పటికే నేర్చుకుందని సమాచారం. ఇకపోతే ఇదే చిత్రంలో కొరియా నటి బేయ్ సుజి కూడా కీలక పాత్ర పోషించనుందని తాజాగా రివీలైంది. బేయ్ సుజీ కొరియాలో ఫేమస్ స్టార్. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. ఈ అమ్మడి యాక్షన్, అందచందాలు సినిమాకి పెద్ద అస్సెట్ కానున్నాయని శంకర్ బృందం భావిస్తున్నారట. ఇక ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రమని చెబుతున్నారు. ఈ సినిమాలో గ్రాఫిక్స్ కి ఆస్కారం ఉన్నా 2.0 రేంజులో అవసరం లేదని తెలుస్తోంది.కాగా ప్రస్తుతం ఈ కొరియన్ భామ కూడా భాగం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈ వార్త సినిమా వర్గాల్లో వైరల్ గా మారింది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here