మెగా ఆఫర్ కొట్టేసిన రంగమత్త ….

0
32

 

అనసూయ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు. జబర్దస్త్ షో తో యాంకర్ పరిచయం అయినా అనసూయ తనకంటూ ఓ ప్రేత్యేక గుర్తింపును సంపాదించుకుంటున్నారు. సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలలో నటించారు. సోగ్గాడే చిన్ని నాయనా చిత్రంతో పరిచయం అయిన అనసూయ ఆ సినిమాలో గ్లామర్ పాత్రకే పరిమితం అయ్యారు. ఆ తరువాత అడవి శేష్ నటించిన క్షణం సినిమాతో తనదైన నటనతో మెప్పించారు. ఆ తరువాత రంగస్థలం సినిమాలో రంగమ్మత్త అనసూయ చేసిన నటనను ఎవరు మరచి పోలేరు. ఈ సినిమాలో తనదైన నటనతో అన్ని రకాల భావోద్వేగాలతో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. మరోసారి రంగమ్మత్త మెగా బంపర్ ఆఫర్ కొట్టేసింది మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో అనసూయ మంచి అఫర్ ని కొట్టేశింది. ఈ సినిమాలో హీరోయిన్ కు సమానంగా ఓ ముఖ్యమైన పాత్ర ఉంటుందని ఆ పాత్ర కోసం అనసూయను తీసుకున్నట్టు దానికి అనసూయ కుడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here