ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న అనుష్క డ్యూయల్ ఫోటో!

0
76
ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రమే కాక, యావత్ ప్రపంచవ్యాప్తంగా వున్న సినిమా అభిమానులు ఆశ్చర్యపోయే ఘటన ఒకటి కొద్దిరోజులుగా సోషల్ మీడియా వేదికల్లో చక్కర్లు కొడుతోంది. అది ఏంటంటే, బాలీవుడ్ నటి మరియు క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మను పోలి, అచ్చం ఆమెలానే వున్న మరొక వ్యక్తి ఫోటో మూడురోజుల క్రితం ట్విట్టర్ లో దర్శమిచ్చింది. అయితే ఫొటోలో ఆమె మాత్రం తన జుట్టుకు తెల్ల రంగు వేసిఉండడంతో, ఆమె కూడా అనుష్కనే, కాకపోతే జుట్టుకు రంగు వేసుకుంది అంతే అంటూ చాలమంది కొట్టిపారేశారు. అయితే చివరకు  ఆ ఫొటోలోని అమ్మాయి అనుష్క కాదని,
Image result for anushka sharma
అమెరికన్‌ గాయని జులియా మైకెల్స్‌ అని తెలియడంతో అందరూ ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే కొంతమంది వీరిద్దరి ఫొటోలను పక్కపక్కన పెట్టి అనుష్కా, మీకు చెల్లి ఉందా సరదాగా కామెంట్లు పెట్టినవారు కూడా లేకపోలేదు. ఇప్పుడు ఈ ఫొటో కాస్తా అనుష్క, జులియా కంటపడింది. దాంతో జులియా వెంటనే అనుష్కకు ట్విటర్‌లో ఈ ఫొటోను పోస్ట్‌ చేస్తూ.. ‘హాయ్‌ అనుష్క.. మనమిద్దరం కవలలమట’ అని సరదాగా మెసేజ్‌ పెట్టారు.  ఇందుకు అనుష్క స్పందిస్తూ, ‘ఓ మై గాడ్, అవును, మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట. నువ్వు కనిపించావ్‌ కాబట్టి మరో ఐదుగురి కోసం వెతుకుతున్నాను’ అంటూ ఫన్నీగా రిప్లై ఇచ్చారు. దాంతో వీరిద్దరి ట్విటర్ చాట్‌ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here