న్యూ లుక్ లో ఫ్యాన్స్ మతిపోగొడుతున్న అనుష్క!

0
78
గత ఏడాది ‘భాగమతి’గా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ ని అందుకున్న అందాల భామ అనుష్క, ఆ తరువాత తన తదుపరి సినిమాకి చాలా రోజులు విరామం తీసుకుని ప్రస్తుతం ‘సైలెన్స్’ అనే సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, సుబ్బరాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తుండగా, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతుంది ఈ చిత్రం. కాగా ఇటీవల అమెరికాలో తన వెయిట్ తగ్గడం కోసం ట్రీట్మెంట్ తీసుకుంది అనుష్క. ఇక నేడు సోషల్ మీడియాలో సన్నబడిన అనుష్క లుక్ బాగా వైరల్ అవుతుంది.
ఈ లుక్ లో ఆమెను చూసిన ఫ్యాన్స్,  అనుష్క మళ్ళి ఎంతో అందంగా తయారయినందుకు సంతోషంతో సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అనుష్క చెయ్యబోతున్న సైలెన్స్ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. మార్చి నుండి షూటింగ్ ను జరుపుకోనుంది. ఈ చిత్రాన్ని కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించనున్నాయి. కాగా ప్రస్తుతం ఆమె ఫోటోలు వివిధ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here