ఆమె కాళ్ళు మొక్కిన పవన్…….

0
36

వీధికో గూండా ఉండే ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రము లో దళిత మహిళా అయినా మాయావతిని అక్కడ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారని, అందుకే ఆమె కాళ్ళు మొక్కినట్లు జనసేన పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. సోమవారం ఆయన తూర్పు గోదావరి జిల్లా అమలాపురం బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత త్రిమూర్తులు పై విరుచుకు పడ్డారు. ` తోట త్రిమూర్తులను నేను ఎప్పుడు పార్టీలోకి రమ్మని అడగలేదు.

2014లో మేము మద్దతు ఇస్తేనే టీడీపి  ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తోట త్రిమూర్తులు లాంటి వ్యక్తులను చెంచాలు అంటారు.  త్రిమూర్తులు జాతి గౌరవం కాపాడు. నేను నా అన్న చిరంజీవి మాటే వినను. నీ మాట ఎలా వింటాను. తెలుగుదేశం నాయకులూ బానిస బతుకులను  బ్రతుకుతున్నారు. టీడీపీ, జనసేన, ఒకటే అంటూ అవగాహనా లేని మాటలు మాటలాడకండి`అంటూ ధ్వజమెత్తారు.   కాగా ఏపీలో బీఎస్పీ తో కలిసి జనసేన ఎన్నికల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారం భాగంగా బీఎస్పీ అధినేత్రి మాయావతి వచ్చిన సందర్భంగా పవన్ కళ్యాణ్  కాళ్ళు మొక్కారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here