ఎపి భారీగా పట్టుబడ్డ డబ్బు……

0
53

శ్రీకాకుళం  జిల్లాలో భారీగా డబ్బును పోలీసులు పట్టుకున్నారు. విజయనగరం నుంచి శ్రీకాకుళం జిల్లా వస్తున్న ఆర్టీసీ బస్సులో బొద్దాం వద్ద ఈనగదును పోలీసులు పట్టుకున్నారు. ఆ బస్సులో డబ్బు తరలిస్తున్నారని తెలుసుకున్న పొలిసులు ఆ బస్సును తనిఖీ చేశారు. బస్సు దిగువ భాగంలోని లగేజ్ క్యాబిన్ లో మూడు బ్యాగ్గులో నోట్ల కట్టలు ఉన్నట్టు రాజాం సీఐ వేణు గోపాల్ గుర్తించారు. వెంటనే ఆ బస్సులో ఉన్న ప్రయాణికులను పోలీస్ స్టేషన్ కు తరలించారు.

పాలకొండ డిఎస్పీ ప్రేమ్ కాజల్ స్టేషన్కు చేరుకొని ఆ బగ్గులను పరిశీలించారు. రెవెన్యూ అధికారులు, ప్లేయింగ్ స్స్క్వాడ్ కు సమాచారం ఇవ్వడం తో వారు అక్కడికి చేరుకున్నారు. మూడు లగేజి బ్యాగ్గులో భారీ మొత్తం ఉందని గుర్తించారు. డబ్బు లెక్కించే యంత్రాలను ఏర్పాటు చేశారు. బస్సులో రాజాం, పాలకొండ నియోజవర్గాలను పర్యవేక్షించే వైసీపీ కీలకనేత ఉండడంతో పట్టుబడిన నగదు వైసీపీకు చెందినదేనని భావించి పోలీసులు విచారణ చేస్తున్నారు. పట్టుబడ్డ  నగదు సుమారు కోటి రూపాయల వరకు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here