జగన్ సీఎం ….. చంద్రబాబుకి రిటైర్మెంట్ … కేటీఆర్

0
48

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ అధినేత వైస్ జగన్ విజయం ఖాయం అంటూ తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏపీకి కాబోయే సీఎం వైస్ జగనేనని అయన అన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు రిటైర్మెంట్ తీసుకోవడం ఖాయం  అని అయన అన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబుకి రిటైర్మెంట్ ఇవ్వడానికి నిర్ణయించుకున్నారని అయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు దిగజారి పోయారని .. కెసిఆర్ ను తట్టడమే పెట్టుకున్నారని మండిపడ్డారు.

ఆయన్ను తిట్టినంత మాత్రాన ఏపీకి జరిగేదేమీ ఉండేదన్నారు. ఏపీతో సంభంధాలున్నవారంతా జిహెచ్ఎంసి అసెంబ్లీ ఎన్నికల్లో తమకే  ఓటేశారని… గెలిచినా సీట్లే అందుకు నిదర్శమన అన్నారు. తెలంగాణ 16 సీట్లు వస్తాయని .. ఖమ్మం. సికింద్రాబాద్ లోను తెరాస జెండా ఎగరడం ఖాయమన్నారు. అందులో తమకు ఎలాంటి అనుమానాలు లేవన్నారు. కేరళలో పోటీచేస్తున్న రాహుల్ గాంధీకి స్థానికత వర్తించదని అన్నారు.

లోక్సభ ఎన్నికల తార్వత కాంగ్రెస్ మాయామయుతున్నదని .. చాల మంది కాంగ్రెస్ అభ్యర్థులు ప్రచారం మానేసి ఇంట్లో కూర్చోవాలని అన్నారు. నల్గొండలో గెలుస్తాడని అనుకుంటున్నా  ఉత్తమ్ కుమార్ రెడ్డి ..ఎం ఎల్ ఏ పదవికి రాజీనామా చేయాలనీ సవాల్ విసిరారు. రాజకీయ సన్యాసం తీసుకుంటనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతున్నారని.. అసలు ఆయన రాజీకీయాల్లో ఉన్నారని ఎలా అనుకున్నటున్నారని ఈస్టైర్లు వేశారు కేటీఆర్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here