అర్జున్ రెడ్డి దర్శకుడితో ఎన్టీఆర్….. మ్యాటర్ ఏంటంటే?

0
127
ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా అర్జున్ రెడ్డి సినిమాని తెరకెక్కించిన సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ, ఆ చిత్రం అద్భుత విజయం సాధించడంతో మంచి ఫేమస్ అయిపోయారు. అయితే అయన ఇప్పటివరకు తన తదుపరి సినిమాని మాత్రం ప్రకటించలేదు. దానికి కారణం, చేస్తే ఖచ్చితంగా మంచి విజయవంతమైన సినిమా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఇంత గ్యాప్ తీసుకున్నట్లు అయన చెప్తున్నారు. ఇక ఇటీవల ఒక మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడిన సందీప్ రెడ్డి, రాబోయే రోజుల్లో యంగ్ టైగెర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్లు చెప్పారట.
Image result for ntr sandeep reddy
ఇక తనకు ఎన్టీఆర్ లోని నటుడిని ఎలా వాడుకోవాలో బాగా తెలుసునని, సినిమాల్లో అయన పండించే యాక్షన్ మరియు ఎమోషన్ కి తగ్గట్లుగా సరిపోయే ఒక కథను సిద్ధం చేసాడట, అంతేకాదు ఆ కథ విషయం ఇటీవల ఎన్టీఆర్ ని కలిసిన సందీప్ రెడ్డి, స్క్రిప్ట్ మొత్తం పూర్తి అయ్యాక ఆయనతో కలిసి సినిమా తప్పక తీస్తానని అన్నారట. అయితే ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇది కూడా అర్జున్ రెడ్డి మాదిరి బోల్డ్ స్టోరీ అట. అయితే ఇక ఈ సినిమా రేపు పట్టాలెక్కి సినిమా ప్రియులను ఎంతమేర అలరిస్తుందో తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజలు ఆగవలసిందే…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here