అదరగొడుతున్న అర్జున్ రెడ్డి తమిళ ట్రైలర్ ….!!

0
107
ఇటీవల విజయ్ దేవరకొండ హీరోగా నూతన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన సూపర్ డూపర్ సెన్సేషన్ అర్జున్ రెడ్డి… ఇక ఈ సినిమా విజయం తరువాత విజయ్ ఒక్కసారిగా యూత్ లో మంచి క్రేజ్ మరియు క్రేజ్ సాధించి ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగాడు ఇక ప్రస్తుతం ఈ సినిమా తమిళ ట్రైలర్ ని యూట్యూబ్ లో విడుదల చేసారు. ఇకపోతే ఈ సినిమాలో తమిళ హీరో చియాన్ విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా నటిస్తుండగా, హీరోయిన్ గా మేఘ నటిస్తోంది. ‘వర్మ’ పేరుతో ఈ సినిమాను భారీగా తెరకెక్కించాడు దర్శకుడు బాల…
Related image
ఇక విజయ్ తెలుగు వర్షన్ లో బాస్కెట్ బాల్ ఆటగాడైతే, ఇందులో ధ్రువ్‌ హాకీ ఆడుతూ కనిపించాడు. ఇక ట్రైలర్ లోని ఆస్పత్రిలో సర్జరీ, బులెట్‌పై వెళ్లే సన్నివేశాలు సహా చాలా సీన్లు మన అర్జున్‌రెడ్డిని గుర్తుకు తెస్తున్నాయి. ఇక ట్రైలర్ లో ధృవ్ నటన కూడా చాల బాగుందనే చెప్పాలి. ఇక ఈ సినిమాను ఈ4 ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై ముఖేష్ మెహతా నిర్మిస్తున్నారు. ఇక మరొకవైపు ఈ సినిమా హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. మరి ధృవ్ కు తొలిచిత్రంగా రానున్న ఈ సినిమా ఏ మేర విజయాన్ని అందుకుని అతడికి పేరుతెస్తుంది చూడాలి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here