అసలు జీవిత భీమా ఏ వయసు వారు తీసుకోవాలి….ఎటువంటి పాలసీ తీసుకోవాలి?

0
19
జీవిత బీమా అంటే ఓ వ్యక్తి తన మరణాంతరం, వారి కుటుంబ జీవనానికి తనవంతుగా ఆర్ధికంగా ఇచ్చే ధీమా అని చెప్పాలి…దీంతో అతడిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు తగిన రక్షణ లభించడంతోపాటు భవిష్యత్తుకు భరోసా లభిస్తుంది. నిజానికి ఎవరికీ ఎప్పుడు ఏమి జరుగుతుంది అనేది మన చేతుల్లో ఉండదు కాబట్టి, ప్రస్తుత కాలంలో ప్రతిఒక్కరు జీవిత భీమాని తీసుకుని వారి కుటుంబానికి రక్షణగా నిలవాలని ఆర్ధిక నిపుణులు చెపుతున్నారు. ఇక బీమాలోని రకాలను బట్టి పరిమిత కాలానికి ఉద్దేశించినవి, జీవిత కాలం పాటు రక్షణనిచ్చే పాలసీలు ఉన్నాయి. వీటిని టర్మ్ పాలసీలుగా,హోల్ లైఫ్ పాలసీలుగా చెబుతారు. టర్మ్ పాలసీ నిర్ణీత కాలానికి జీవిత బీమా రక్షణనిచ్చే పాలసీ ఇది. కాల వ్యవధి తర్వాత రాబడుల రూపంలో ఏమీ తిరిగి రాదు. తక్కువ ప్రీమియానికి, వ్యక్తి మరణాంతరం మాత్రం ఎక్కువ రక్షణ ఈ పాలసీల్లో ఉంటుంది. ఇవి కాకుండా జీవిత బీమా రక్షణతోపాటు కాల వ్యవధి ముగిసిన తర్వాత పాలసీదారుడు జీవించి ఉంటే రాబడులను అందించే సంప్రదాయ బీమా పొదుపు పథకాలు ఉండనే ఉన్నాయి.
Image result for life insurance policy
వీటిలో ప్రీమియం ఎక్కువ, రక్షణ తక్కువ ఉంటుంది. వీటిలోనే జీవితాంతం రక్షణనిచ్చే పాలసీలను హోల్ లైఫ్ పాలసీలు లేదా పర్మినెంట్ పాలసీలుగా వ్యవహరిస్తున్నారు.  హోల్ లైఫ్ పాలసీల్లో ప్రీమియం ఎక్కువే ఉంటుంది. 40 ఏళ్లకు పైన వయసున్న వారు పాలసీ తీసుకోవాలనుకుంటే మంచిదని అంటున్నారు నిపుణులు. అదే మీ వయసు ఒకవేళ 25 ఏళ్లలోపు వారు అయితే, సాధారణ పాలసీని తీసుకుని కాల వ్యవధి తీరే సమయంలో హోల్ లైఫ్ పాలసీని ఎంచుకోవడం ప్రయోజనకరం అంటున్నారు. ఇక కొన్ని రకాల టర్మ్ పాలసీలు వున్నాయి.. సాధారణంగా లైఫ్ టర్మ్ పాలసీలు 30 నుంచి 35 ఏళ్లకే పరిమితం. ఈ కాల వ్యవధి వరకు ప్రీమియం చెల్లిస్తేనే పాలసీ మనుగడలో ఉంటుంది. పాలసీ కాల వ్యవధి తీరిన తర్వాత క్లోజ్ అయిపోతుంది. అయితే ఒకవేళ మధ్యలో మరణం సంభవిస్తే నామినీకి మొత్తం క్లెయిమ్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది… జీవితానికి బీమా రక్షణ ఎందుకో ఆలోచించండి. తమపై ఆధారపడిన వారు ఉంటేనే బీమా పాలసీ తీసుకోవాలని నిపుణులు స్పష్టంగా చెబుతుంటారు. తనపై ఎవరూ ఆధారపడి లేనప్పుడు, ఆర్థిక బాధ్యతలు లేనప్పుడు ఓ వ్యక్తి మరణిస్తే తద్వారా వచ్చే పరిహారం ఎవరికీ అవసరం ఉండదు.
Image result for life insurance policy
కనుక ఓ వ్యక్తికి ఆర్థిక బాధ్యతలు ఉన్నంత వరకే, అతని సంపాదనపై వారసులు ఆధారపడి ఉన్నంత వరకే బీమా రక్షణ ఉంటే సరిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు. ఈ బాధ్యతలు కొందరికి 50కే తీరిపోవచ్చు. కొందరిలో 60, కొందరిలో 70వ ఏట వరకూ ఉండొచ్చు. ఆయా పరిస్థితులను బట్టి ఎవరికి వారు తమకు ఎంత వయసు వరకు బీమా రక్షణ అవసరమో నిర్ణయించుకోవాలి.  అంతేకానీ, సాధారణ సూత్రమైన 60వ ఏట వరకు తీసుకోవడం కరెక్ట్ కాదు. కొందరు చాలా చిన్న వయసులోనే జీవితంలో మెరుగైన స్థితికి చేరుకుంటారు. అధిక సంపాదన స్థితికి వెళతారు. వీరికి, ఇతరులతో పోలిస్తే బీమా రక్షణ అంతగా అవసరం ఉండకపోవచ్చు. బీమా పాలసీల్లో గరిష్ట కాల వ్యవధి కొన్నింటిలో 30, 35 ఏళ్లు మాత్రమే ఉంటోంది. ఉదాహరణకు 25 ఏళ్ల వ్యక్తి ఈ తరహా పాలసీ తీసుకుంటే గరిష్టంగా 35 ఏళ్లే కనుక 60వ ఏట వరకే బీమా కవరేజీ ఉంటుంది. కానీ, అప్పటికి బాధ్యతలు అన్నీ తీరిపోవాలని లేదు. కనుక గరిష్ట కాల వ్యవధిపై పరిమితులు లేని పాలసీని ఎంచుకోవడమే నయం. సూ చూసారుగా మన జీవనానికి ఎంతో కొంత వస్తుందిలే అని సరిపెట్టుకోకుండా, మన మరణాంతరం కూడా మన కుటుంబానికి ఎంతో కొంత ఆసరాగా నిలవడానికి ప్రతిఒక్కరు తమకు వీలైనంత మొత్తంలో భీమా చేస్తే మెలనేది ఆర్ధిక నిపుణుల మాట…
Related image