జబర్దస్త్ పొట్టి నరేష్ పై దాడి, కలకలం రేపుతున్న వివాదం!

0
47
ప్రస్తుతం తెలుగు టివి ఛానల్స్ లో ప్రసారం అయ్యే ప్రోగ్రామ్స్ లో మంచి ప్రేక్షకాదరణ కలిగిన షోగా పేరుగాంచింది జబర్దస్త్ షో. ఇక ఈ ప్రోగ్రామ్‌లో  పార్టిసిపెంట్స్ చేసే స్కిట్స్ కు యూట్యూబ్ లో కూడా అత్యధిక వ్యూస్ వస్తుంటాయి. ఇకపోతే షోలో ఒకింత ఎక్కువ హడావుడి చేసేవారిలో పొట్టి నరేష్ ఒకరు . అతడికి వయసు 20కి పైగా ఉన్నా, జన్యు లోపంతో ఐదేళ్ల బాలుడిగా కనిపిస్తుంటాడు నరేష్. తన లోపానికి కుంగిపోకుండా జబర్దస్త్ ద్వారా వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుని దూసుకుపోతున్నాడు. డైలాగ్ డెలివరీతో పాటు డ్యాన్సుల్లోనూ ఇరగదీస్తుంటాడు. అందుకే అనేక కార్యక్రమాల్లో ప్రదర్శన ఇచ్చేందుకు అతడిని ఆహ్వానిస్తుంటారు. తాజాగా ఓ కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన నరేష్ టీమ్‌కు చేదు అనుభవం ఎదురైంది.   శ్రీకాకుళం పట్టణంలో కళింగాంధ్ర ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి జబర్దస్త్ ఫేం నరేష్ తన టీమ్‌తో ప్రదర్శన ఇచ్చాడు.
Image result for జబర్దస్త్ పొట్టి నరేష్
ఈ సందర్భంగా కొందరు యువకులు గ్రీన్ రూమ్‌లోకి తొంగి చూసేందుకు ప్రయత్నించగా బౌన్సర్లు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన యువకులు బౌన్సర్లతో వాగ్వాదానికి దిగారు. నిర్వాహకులు కలగజేసుకోవడంతో వివాదం సమసింది. ఆ తర్వాత నరేష్ టీమ్ ప్రదర్శన ఇచ్చి తిరిగి పయనమైంది. అయితే గొడవను మరిచిపోని ఆ యువకులు నరేష్ టీమ్ ప్రయాణిస్తున్న కారుపై చిన్న బరాటం వీధికి రాగానే రాళ్లు విసిరి పరారయ్యారు. ఈ దాడిలో కారు అద్దాలు పగిలాయి.    ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు స్థానికులు ఆ యువకులను పట్టుకునేందుకు ప్రయత్నించగా ఒకడు చిక్కాడు. దీనిపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.  కాగా ఈ ఘటన మొత్తం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here