భారీ స్కోర్ దిశగా ఆసీస్…. స్కోర్ ఎంతంటే?

0
72
భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే భరత్ జట్టు రెండు వన్డేల్లో విజయం సాధించగా, ఇక మూడో వన్డేలో ఆతిథ్య జట్టు ఆసీస్ ఎలాగైనా విజయాన్ని తమ సొంతం చేసుకోవాలని ట్రై చేస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత జట్టు బౌలింగ్ ని తీసుకుంది. ఇక బ్యాటింగ్ కి దిగిన ఆసీస్ జట్టు ప్రస్తుతం ఆరో వికెట్‌ కోల్పోయింది. ఇక ఆ జట్టులో దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్‌ (26) షమీ బౌలింగ్‌లో భువనేశ్వర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.
Image result for india vs australia 3rd odi
అంతకుముందు స్టొయినిస్‌ (10) చాహల్‌ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు దారిపట్టాడు. ప్రస్తుతం క్రీజులో పీటర్‌ హ్యాండ్స్‌కోంబ్‌ (25), రిచర్డ్‌సన్‌(0) ఉన్నారు. అయితే భరత్ పడకొట్టిన ఆరు వికెట్లలో మూడు చాహల్‌కే దక్కడం గమనార్హం. 35 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోరు 162/6. అయితే ఈ దూకుడు చూస్తుంటే ఆసీస్ జట్టు తప్పకుండా 300 పైచిలుకు భారీ స్కోర్ చేసే అవకాశం కనపడుతోందని, అయితే ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తున్న బ్యాట్స్ మాన్ లలో ఒక్కరు జట్టుకు అండగా నిలిస్తే ఆ స్కోర్ సాధ్యమేనని క్రీడా విశ్లేషకులు చెపుతున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here