జనవరి ఒకటో తేదీన జన్మించిన ఆడపిల్లలకు రూ.5లక్షలు……ప్రభుత్వం సంచలన నిర్ణయం!

0
78
ప్రస్తుతం మన దేశంలో 1000 అబ్బాయిలకు కేవలం 750 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నారని ఇటీవల ఒక నివేదిక వచ్చిన విషయం తెలిసిందే. ఇక గత కొన్నేళ్లుగా ఆడపిల్ల పుడితే ఆ బిడ్డను మొగ్గలోనే చిదిమేసిన ఘటనలు కూడా మన దేశంలో సంచలనాన్ని తెరలేపాయి. ఇప్పటికీ కూడా అక్కడక్కడా ఆడబిడ్డలకు జన్మనిచ్చిన తల్లులకు కూడా శిక్షలు విధిస్తూనే వున్నాయి కొన్ని కుటుంబాలు. అయితే ఇటువంటి వంటి దురాచారాలకు చెక్ పెట్టేందుకు, తల్లి గర్భంలో వుంది మగ బిడ్డో లేక ఆడ బిడ్డో తెలిపే స్కానింగ్ ని దేశవ్యాప్తంగా నిషిద్ధం విధించింది. అయితే కొన్నాళ్ల నుండి ఆడబిడ్డను కనే తల్లితండ్రులకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని రకలా ప్రోత్సాహకాలు తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే  ఇప్పటివరకు ప్రవేశపెట్టిన పథకాలకు భిన్నంగా ఒక కొత్తరకమైన పధకాన్ని తీసుకువచ్చింది కర్ణాటక ప్రభుత్వం. ఇక ఈ ప్రభుత్వం  జనవరి ఒకటిన బీబీఎంపీ పరిధిలోని పాలికె 24 ఆసుపత్రిలో జన్మించిన తొలి 24 మంది ఆడపిల్లలకు రూ.5 లక్షలు చొప్పున పుట్టిన ఆడ బిడ్డ పేరున బ్యాంకులో డిపాజిట్ చేయడం జరుగుతుందని బెంగళూరు మేయర్ గంగాంబిక నేడు ఒక ప్రకటనలో తెలిపారు.
Five Lakh Price Money For New Year Born First 24 Girl Childs Karnataka - Sakshi
గత ఏడాది నుంచి బీబీఎంపీ పింక్‌ బేబీ పేరుతో న్యూ ఇయర్‌ మొదటి రోజున జన్మించిన ఆడపిల్లలకు రూ.5 లక్షలు అందించే పథకం అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఈ ఏడాది కూడా పింక్‌ బేబి పథకాన్ని కొనసాగిస్తామని మేయర్‌ తెలిపారు. జనవరి 1 తేదీన జన్మించిన మొదటి మగబిడ్డకు ఈ పథకం వర్తించదని తెలిపారు. ఒక వేళ జనవరి 1 తేదీన ఆడపిల్లలు జన్మించకుండా 2 తేదీ పుట్టినా అలాంటి ఆడపిల్లలకు రూ.5 లక్షల ప్రోత్సాహక ధనం అందిస్తామని మేయర్‌ తెలిపారు. నిజానికి ఆడబిడ్డలను కనే వారికి కొంత ఆర్ధిక చేయూతనిచ్చే విధంగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకువచిన ఈ పధకం పై పలువురు ప్రముఖులు మరియు అక్కడి మీడియావారు ప్రభుత్వంపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ పధకం ప్రస్తుతం మీడియా వేదికల్లో వైరల్ గా మారడంతో దీనిని దేశంలోని మరిన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తే బాగుంటుందని పలువురు ప్రజలు తమ అభిప్రాయాన్ని  వ్యక్తపరుస్తున్నారు. మరి వైరల్ అవుతున్న ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here