బాలయ్య – బోయపాటి సినిమా ఖర్చు తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే!

0
21
యువరత్న నందమూరి బాలకృష్ణ మరియు మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను ల కాంబినేషన్ లో ఇప్పటికే వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు అద్భుత విజయాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే త్వరలో వీరిద్దరి కాంబినేషన్లో హ్యాట్రిక్ సినిమా రూపొందనుండడంతో, ఆ చిత్రానికి 70 కోట్లకు పైగా బడ్జెట్ తో సినిమాకు ఖర్చు చేసేలా అంచనాలు వేసాడట దర్శకులు బోయపాటి. దాంతో ఈ విషయం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. బాలకృష్ణ, బోయపాటి ల కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ చిత్రాలు బ్లాక్ బస్టర్ లు  అయి మంచి కలెక్షన్లు సంపాదించినప్పటికీ కూడా, తాజాగా అయన నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా20 కోట్ల షేర్ మాత్రమే రాబట్టింది .
Image result for balakrishna boyapati movie
దీన్నిబట్టి బాలయ్యకు 50 కోట్ల షేర్ వసూల్ చేయడం కొంత కష్టం అని అర్ధం అవుతోంది. ఇక ఈ కాంబినేషన్ లో ఏకంగా 70 కోట్ల బడ్జెట్ అంటే, ఆ సినిమా ఎట్టి పరిస్థితుల్లో దాదాపుగా రూ.100 కోట్ల కలెక్షన్ రాబట్టాలని, అంతేకాక అది బాలయ్య మార్కెట్ పరముగా కూడా చాలా పెద్ద రిస్క్ అని సినిమా విశ్లేషకుల అభిప్రాయం. పైగా బోయపాటి దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన వినయ విధేయ రామ కూడా డిజాస్టర్ అయ్యింది . ఆ రకంగా చూసుకున్నా భారీ బడ్జెట్ అన్నది ఈ కాంబినేషన్ కు మరింత పెద్ద రిస్క్. మరి ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వార్తల ప్రకారం నిజంగా వారి కాంబినేషన్ సినిమా అంత బడ్జెట్ తో తెరకెక్కనుందా అనేది తెలియాలంటే మాత్రం, చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటనా వచ్చే వరకు వేచి చూడవలసిందే………