బాలకృష్ణ భార్య వసుంధర నిజస్వరూపం తెలిస్తే షాక్ అవుతారు!

0
127
టాలీవుడ్ లోని అతిపెద్ద ఫ్యామిలీల్లో ఒకటిగా నిలిచే ఫ్యామిలిలో ఒకటి నందమూరి ఫ్యామిలీ. ఇక ఈ ఫ్యామిలీ నుండి లెజెండరీ నటుడు ఎన్టీఆర్ తరువాత బాలకృష్ణ, హరికృష్ణ, ఎన్టీఆర్, తారకరత్న, కళ్యాణ్ రామ్, కళ్యాణ్ చక్రవర్తి వంటి వారు సినిమాల్లోకి వచ్చినప్పటికి వారిలో ఎక్కువగా క్రేజ్ మరియు పేరు సంపాదించింది మాత్రం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పుకోవాలి. ఇకపోతే, వారిలో బాలకృష్ణ సినీ రంగప్రవేశం చేసిన తరువాత అయన సినిమాల్లోనే ఒకింత ఎక్కువసమయం గడపడంతో కుటుంబాన్ని భార్య వసుంధర చూసుకునేవారట. బాలకృష్ణ దంపతులకు బ్రాహ్మణి, తేజస్విని, మోక్షజ్ఞ సంతానం. అయితే మొదటినుండి అటు  షూటింగులతో పాటు, ఇటు కుటుంబానికి కూడా బాలకృష్ణ కొంత సమయం కేటాయించినప్పటికీ కూడా తమ పిల్లలతో సరిగ్గా గడపలేకపోతున్నాను అనే దిగులు మాత్రం ఆయనలో ఉండేదట. అయితే పిల్లలకు తమ తండ్రిని మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ రాకుండా వారికి సంబంధించి దగ్గరుండి అన్ని అవసరాలు చూసేవారట భార్య వసుంధర. అంతేకాదు అత్తయ్య  బసవతారకం, మామయ్య ఎన్టీఆర్ లు బ్రతికి వున్నపుడు, వారికి కూడా తమ ఇంట్లో ఏ విధమైన లోటు రాకుండా ఆమె దగ్గరుండి చూసుకునేవారట. అందుకే భార్య మీద నమ్మకంతో బాలకృష్ణ షూటింగ్ కోసం విదేశాలకు కానీ లాంగ్ టైం షూటింగ్ లకు గాని వెళ్ళినపుడు పిల్లల బాధ్యతను గురించి ఎక్కువగా భయపడేవారు కాదట.

ఇకపోతే తనకు కూడా జీవితంలో కొన్ని కష్టమైన సమయాల్లో భార్య వసుంధర తోడు నీడగా నిలిచేదని, ఇక తనపై కాల్పుల కేసు నడిచిన సమయంలో వసుంధర దగ్గరుండి ఆయనకు ధైర్యం చెప్పేవారట. అందుకే బాలకృష్ణ వసుంధరను ఈ జన్మలో తనకు దొరికిన అదృష్టంగా భావిస్తాను అంటూ తమ కుటుంబ సభ్యుల వద్ద చెపుతుంటారట. అంతేకాదు పెద్ద కుమార్తె బ్రాహ్మణి, రెండవ కుమార్తె తేజస్విని వివాహం సమయంలో ఎవ్వరికీ చిన్నపాటి సమస్య కూడా తలెత్తకుండా చాలావరకు పనులన్నీ ఆమె దగ్గరుండి మరీ పర్యవేక్షించారట. ఇక ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే వసుంధర వారిని సాదరంగా ఆహ్వానించి, భోజనం చేయనీయకుండా బయటకు వెళ్లనివ్వరని, అంతేకాక ఇంటికి వచ్చినవారికి రకరకాల వంటలను వడ్డించి ఆతిధ్యమిస్తుంటారట. ఇక ఈ విధంగా వసుంధర, బాలకృష్ణ కుటుంబానికి అన్నింటా సహాయకారిగా ఉండడం పట్ల నందమూరి అభిమానులు ఆమెకు సోషల్ మీడియా వేదికల్లో కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here