మతిపోగొడుతున్న బాలకృష్ణ 100 అడుగుల కటౌట్|#balakrishna|telugugaramchai

0
77
విశ్వ విఖ్యాత నటసార్వభౌమ నటరత్న డాక్టర్ నందమూరి తారకరామా రావు గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న కొత్త సినిమా ఎన్టీఆర్. ఇక ఈ సినిమా ప్రారంభం నాటి నుండి ఎంతో క్రేజ్ సంపాదించింది. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారి పాత్రలో నటించిన బాలకృష్ణ, ఆ మహానటుడు గెటప్ లో ఎలా వుంటారా అనేది చూడాలని సినిమా ప్రకటించినప్పటినుండి నందమూరి అభిమానులు మాత్రమే కాదు యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం వేయి కళ్ళతో ఎదురు చూసారు. అయితే ఇటీవల ఆడియో విడుదల వేడుకను జరుపుకున్న ఈ సినిమా జనవరి9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమాకు సంబందించిన ఒక ప్రత్యేక విషయం ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇక అసలు మ్యాటర్ లోకి వెళితే,
ఈ సినిమాలో అప్పట్లో ఎన్టీఆర్ ధరించిన కాషాయ దుస్తుల్లో కనిపించిన బాలకృష్ణ 100 అడుగుల కటౌట్ ని హైదరాబాద్ లోని నిజాం పెట్ ప్రాంతంలో నెలకొల్పారు అయన అభిమానులు. ఎన్నో వ్యయప్రయాశలతో, ప్రభుత్వం మరియు పోలీసుల నుండి అనుమతులు సంపాదించి మరీ ఈ కటౌట్ ని నెలకొల్పడం జరిగిందని, తెలుగు వారి ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన శ్రీ ఎన్టీఆర్ గారి చరిత్ర అందరికి మరింతగా చేరువవ్వాలనే ఉద్దేశ్యంతోనే ఈ విధంగా అయన రూపులో వున్న బాలయ్య గారి కటౌట్ ని ఏర్పాటు చేయడం జరిగిందని నందమూరి అభిమానులు చెపుతున్నారు. ఇక ఈ కటౌట్ తాలూకు ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో వైరల్ గా మారాయి. తప్పకుండ కృష గారు తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here