మరోసారి అభిమాని ని వెంబడించి చితక బాదిన బాలయ్య…..

0
21

సినీ హీరో, టిడిపి నేత, హిందూపురం సిట్టింగ్ ఎమ్మెల్యే నందమూరి బాలయ్య మరోసారి దురుసుగా ప్రవర్తించాడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ టిడిపి కార్యకర్తను వెంటపడి కొడుతున్న వీడియో సోషల్ మీడియా లలో వైరల్ గ మారింది. విజయనగరం జిల్లా చీపురుపల్లి లో ఎన్నికల ప్రచారం నిర్ణహించిన బాలయ్య… నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే… ఓ యువకుడి మీద దాడి చేశాడు.

ఈ వీడియోను వైస్సార్సీపీ కూడా ట్విట్ చేసింది విళ్ళు  నాయకుల ఎలాంటి వాళ్ళను మళ్ళి  ఎన్నుకోవాల?నడిరొడ్డిపై అభిమానిని కొట్టిన నందమూరి బాలకృష్ణ అనే క్యాప్షన్ తో  ఆ పార్టీ  వీడియో ను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. బాలయ్య అభిమానులపై దాడి చేయడం ఇదేమి మొదటిసారి  కాదు.గతంలో అనేక సార్లు ఫ్యాన్స్ కొట్టారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఓ అభిమాని పై బాలయ్య దాడి చేయగా … టిడిపి జెండాలను తగబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ఇటీవలే హిందువురంలో ప్రచారం నిర్వహించిన బాలయ్య జర్నలిస్ట్ ను  బెదిరించిన సంగతి తెలిసిందే. ఫొటోలు డిలీట్ చేయాలనీ ఆయన వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత క్షమాపణ  చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here