బండ్ల గణేష్ బడా మోసం…. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

0
67
ఎవరైనా సెలెబ్రిటీ హోదాగల వ్యక్తులు చేసేపనులు మరియు మాట్లాడే మాటలు రెండు కూడా కొంత అదుపులో ఉంచుకోవాలి. ఎందుకంటే, వారు చెప్పే మాటలు చేసే పనులు వారిని అనుసరించే అభిమానులను ఎంతగానో ప్రభావితం చేస్తాయి. ఇక మీడియా మరియు సోషల్ మీడియా మాధ్యమాలు విపరీతంగా పెరిగిన ఈ రోజుల్లో అటువంటి వారు చేసే ఏ చిన్నపని అయినా కూడా ప్రజలందరికీ ఎంతో త్వరగా చేరువ అవుతోంది. అందుకే చాలావరకు సెలెబ్రిటీలు తాము చేసే పనులుమరియు మాట్లాడే మాటలపై జాగ్రత్త వహిస్తుంటారు. ఇక ఇదివరకు తెలుగు సినిమాల్లో అక్కడక్కడా చిన్న చితకా పాత్రల్లో నటిస్తూ వచ్చిన బండ్ల గణేష్, మెల్లగా తనకు తెలిసిన కొందరు పెద్ద వారిని పట్టుకుని ఆపై కొన్నాళ్ళకు రియల్ ఎస్టేట్ వంటి వృత్తుల ద్వారా కోట్లాదిరూపాయలు డబ్బు ఆర్జించాడు. సినిమాల్లో తనకు పవన్ కళ్యాణ్ అంటే దైవం తో సమానం అని చెప్పే గణేష్, ఇటీవల కాంగ్రెస్ లో జాయిన్ అయి అందరిని ఆశ్చర్యంలో పడేశాడు . తనకు కాంగ్రెస్ అంటే చిన్నప్పటినుండి ఎంతో ఇష్టమని, ఈ లైఫ్ మొత్తం కాంగ్రెస్ పార్టీకే అంకితమని ఆయన చెప్పుకొచ్చారు. ఇక ఆ సమయంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపి, సీపీఐ, టిజెఎస్ కలిసి జతకట్టిన మహాకూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని, అంతేకాక కేసీఆర్ మరియు కేటీఆర్ కు అధికారం రావడం కల అని, ఒకవేళ అలా జరిగితే తన గొంతు కోసుకుంటానని మీడియా సాక్షిగా సవాలు విసిరాడు. ఇకపోతే అనుకున్న విధంగా కొద్దిరోజల క్రితం ఎన్నికలు జరగడం, ఇక నిన్న ఫలితాలు రావడం జరిగిపోయాయి.
అయితే ఎగ్జిట్ పోల్స్ లో వచ్చిన ఫలితాల  మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోయి, అతిపెద్ద పార్టీగా అవతరించి మరొక్కసారి తెలంగాణాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక నిన్న ఈ విషయమై ఛాలెంజ్ చేసిన బండ్ల గణేష్ తన గొంతుక కోసుకుంటారా అంటూ కొందరు మీడియా ఛానల్స్ వారు బ్లేడ్లు తీసుకుని మరీ అయన ఇంటికి వెళ్లడం జరిగింది. అయితే వారితో ఫోన్ లో మాట్లాడిన గణేష్, తాను ఇంట్లో లేనని, ఏదో పని మీదకు బయటకు వచ్చానని, త్వరలోనే మీడియా వారిని కలుస్తానని చెప్పడంతో వారు గణేష్ ఇంటి దగ్గరే చాలాసేపు పడిగాపులు పడ్డారు. ఇక ఎట్టకేలకు తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా బదులిచ్చిన బండ్ల, తమ పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని, అంతేకాక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కేసీఆర్, కేటీఆర్ లకు ప్రత్యేకంగా ధన్యవాదాలుతెలుపుతున్నట్లు చెప్పారు. అయితే నేడు మీడియా ముందుకు వచ్చిన గణేష్ మాట్లాడుతూ, తాను ఏదో ఆ రోజూ ఊరికే అలా అన్నానని, అయినా ఏదో ఫ్లో లో అన్న మాటలు పట్టుకుని బ్లేడ్ తీసుకుని మా ఇంటికి మీడియా వారు రావడం ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. ఇక బండ్ల గణేష్ చేసిన ఛాలెంజ్ ని తప్పి అందరి దృష్టిలో ఫూల్ అయినప్పటికీ కూడా ఇలా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తన తప్పును ఒప్పుకుని మాట్లాడడం ఒక రకంగా ఆహ్వానించదగ్గ విషయమై కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికల్లో కామెంట్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here