జనసేనలోనా? నేనా? అంటూ ఆ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేసిన మంత్రి అఖిల ప్రియ!

0
26
గత రెండు మూడు రోజులుగా దివంగత శోభా నాగి రెడ్డి, భూమా నాగి రెడ్డి దంపతుల పెద్ద కుమార్తె మరియు టూరిజం శాఖ మంత్రి భూమా అఖిల ప్రియా టిడిపిని వీడి జనసేన పార్టీలో చేరుతున్నారు అని వార్తలు విపరీతంగా పుకరవుతున్నాయి. అయితే వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెడుతూ అఖిల ప్రియా మీడియా ముఖంగా కొన్ని వ్యాఖ్యలు చేసారు. టీడీపీతో తనకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీని వీడే ప్రసక్తే లేదని మంత్రి అఖిల ప్రియ స్పష్టం చేశారు. అంతేకాక తనకు జనసేనలోకి వెళ్లాల్సిన ఖర్మ తనకు పట్టలేదన్నారు. ఆళ్లగడ్డ అభివృద్ధికి అడిగినన్ని నిధులు ఇస్తున్న చంద్రబాబుకు ఎందుకు దూరం అవుతానని ప్రశ్నించారు.
Image result for bhuma akhila priya
అయితే ఇటీవల వేరే పనుల కారణంగా తాను నియోజకవర్గంలో పనులకు హాజరుకాలేకపోయానని, పోలీసులు తన అనుచరులను వేధిస్తున్నారనే గన్‌మెన్లను దూరంగా పెట్టానని వివరణ ఇచ్చారు. గన్‌మెన్ల వివాదాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లానని మంత్రి అఖిలప్రియ తెలిపారు. అయితే దాన్ని అదునుగా తీసుకుని తనపై లేనిపోనివి కల్పించి కొందరు మీడియావారు ఇలా తప్పుడు రాతలు రాసారని ఆమె అన్నారు.  అంతేకాక తాను వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థిగానే పోటీ చేస్తానని, అలానే అద్భుత విజయాన్ని అందుకుని దానిని చంద్రబాబుకు కానుగా ఇస్తానని మంత్రి తెలిపారు. కాగా అఖిల ప్రియా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…