బిగ్ బాస్ – 3 పార్టిసిపెంట్స్ వీరే….. ఇంటర్నెట్ లో పేర్లు వైరల్…!!

0
77
ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 1 ఎంత పాపులరైందో అందరికి తెలిసిందే. ఇక ఆ సీజన్ లో విజేతగా శివబాలాజీ నిలిచిన విషయం తెలిసిందే. ఇక అనంతరం ప్రసారమైన సెకండ్ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరించారు. అయితే ఎన్టీఆర్ తో పోలిస్తే నాని, అంతగా షోని నడపలేకపోయాడని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఇక ఎలాగో ముగిసిన ఆ షోలో విజేతగా కౌశల్ మందా నిలిచాడు. ఇక అందరి చూపు తదుపరి మూఢవ సీజన్ పై పడింది. మరి ఈ సీజన్ కు హోస్ట్ గా ఎవరు వుంటారో, అన్నిటికంటే ముఖ్యంగా ఎవరెవరిని షోలో పార్టిసిపెంట్స్ గా తీసుకుంటారు అనే దానిపై ఇప్పటినుండే సోషల్ మీడియా వేదికల్లో చర్చ జరుగుతోంది.
Image result for bigg boss 3 telugu
ఇక ఈ షోలో పాల్గొనే పార్టిసిపెంట్స్ లిస్ట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. ఆ లిస్ట్ లో వున్నా వారు ఎవరంటే, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్, గద్దె సిందూర, శోభిత ధూళిపాళ్ల, వరుణ్ సందేశ్, ఉదయభాను, రఘు మాస్టర్, హేమచంద్ర, జబర్దస్త్ నరేష్, టీవీ ఆర్టిస్ట్ జాకీ, చైతన్య కృష్ణ, మనోజ్ నందన్, కమల్ కామరాజు, నాగ పద్మిని, యూట్యూబ్ స్టార్ ‘మహాతల్లి’ ఫేమ్ జాహ్నవి అంటూ వీరి పేర్లు బయటకు వచ్చాయి. అయితే, వీరంతా ఫైనల్‌గా బిగ్‌బాస్ 3 లో ఉంటారా  లేక ఇవి కేవలం ప్రచారంలో ఉన్న పేర్లా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజుల్లో ఆ షో నిర్వాహకులు నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడవలసిందే….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here