50 ఏళ్ళు పైబడినవారు యవ్వనంగా కనపడడం కోసం చైనా అమృతం!

0
68
మనలో ఎక్కువమంది సౌదర్యం సాధనలు  నిత్యం వాడితూ వుంటారు, ఇక వయసు రీత్యా కొంత వయసు వచ్చాక….అంటే 50 పైబడినవారు ఎదుర్కునే సమస్యల్లో మొహం ముడతలు పడడం, అలానే మొహం పై అక్కడక్కడా మచ్చలు వంటివి రావడం చూస్తుంటాం. అయితే అటువంటి వారికి పెద్దగా శ్రమ పడనవసరం లేకుండా రెండు రకాల పద్ధతుల్లో మొహానికి ప్యాక్ లు నిత్యం అప్లై చేసుకుంటే వారి మొహం పై కూడా ముడతలు మరియు మచ్చలు మెల్లగా తగ్గి మొహం యవ్వనంగా కనపడుతుంది. అయితే అందుకోసం ముందుగా చైనీయులు అమృతంగా భావించే బియ్యపు పిండిని ఒక నాలుగు స్పూన్లు తీసుకుని అందులో ఒక నిమ్మ  చెక్కను అలానే కొద్దిగా నీళ్లను కలిపి ఒక పేస్ట్  వలె చేసుకుని, దానిని మన చర్మం పై అప్లై చేసి, కాసేపు బాగా ఆరిన తరువాత చల్లటి నీళ్లతో కడిగితే చర్మం పై వున్న మురికి తొలగి చర్మం కాంతివంతంగా మెరుస్తుంది.
Image result for face mask with rice flour
ఇక రెండవది మరియు అతి ముఖ్యమైనది ఏంటంటే, కొన్ని ఖర్జుర పళ్ళు తీసుకుని అందులో విత్తనాలు తీసేసి, వాటిని ఒక మిక్సీ జార్ లో వేసి బాగా పేస్ట్ లాగా రుబ్బి, ఆ ముద్దని ఒక అరగంట పాటు అలానే వదిలేసి, ఆపై దానిలో కొంత పెరుగును కలిపి ఒక పేస్ట్ లాగా చేసుకుని దానిని మన చర్మం పై కొద్దికొద్దిగా అప్లై చేసుకున్న తరువాత దానిని బాగా, అంటే దాదాపుగా ఒక అరగంట ఆరనిచ్చి, తరువాత చల్లటి నీళ్లతో కడుక్కోవాలి. ఈ రెండు పద్ధతుల్లో కనుక కొన్నాళ్లపాటు రోజు క్రమం తప్పకుండ మన ఫేస్ కి అప్లై చేస్తే, మోహంలో ఉండే ముడతలు మరియు మచ్చలు మెల్లగా తగ్గుముఖం పట్టి, కొద్దిరోజుల్లో మనం కూడా ఎంతో యంగ్ గా కనపడడం జరుగుతుందని సౌందర్య నిపుణులు చెపుతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీలో వయసుపెరిగిన వారు ఉంటె, పైన చెప్పిన విధంగా చేసి మంచి ఫలితాలు పొందండి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here