తెలుగు దేశంపై భారీ కుట్ర…. నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు!

0
436
ఒకప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించిన  క్యారెక్టర్ నటుడు శివాజీ, ఆ తరువాత  మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుని హీరోగా మారారు. ఇక అయన హీరోగా  చేసిన పలు సినిమాలు కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇటీవల భారతీయ జనతా పార్టీలో చేరిన శివాజీ, ఆ తరువాత ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వడంలో బీజేపీ పార్టీ విఫలమైందని ఆ పార్టీకి రాజీనామా చేసారు. అయితే శివాజీ గత కొద్దిరోజలుగా ఏపీకి హోదా కోసం తనవంతుగా పోరాడుతున్న శివాజీ, ఇటీవల ఆంధ్రప్రదేశ్ లోని ప్రధాన పార్టీలపై కుట్ర జరుగుతున్నట్లు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఇక జగన్ పై దాడి కూడా పధకం ప్రకారమే జరిగిందని అప్పట్లో అన్నారు. ఇక ప్రస్తతం రాష్ట్రంలో టిడిపి ప్రాభవాన్ని దెబ్బతీయడానికి అలానే మెజారిటీ ఓటర్లను ఆ పార్టీనుండి దూరం చేయడానికి పెద్ద కుట్ర జరుగుతోంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఇక ఆయన మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలోని 22ఏ సర్వే నెంబర్ లో గల చుక్కల భూముల రైతులను రాష్ట్ర ప్రభుత్వంపై ఉసిగొలుపుతున్నారని అన్నారు. నిజానికి 1910 నుండి 2016 వరకు జరిగిన రిజిస్ట్రేషన్లు ఇప్పుడెందుకు ఆగిపోయాయని అయన ప్రశ్నించారు. అంతేకాక చుక్కల భూములను అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ క్రమబద్ధీకరించిందని, దానికి సంబందించిన ఫైల్ కూడా తన వద్దనే ఉందని, ముగ్గురు అధికారులు దానిని తొక్కిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. కావున ఈ విషయమై త్వరలోనే ముఖ్యమంత్రిని కలుస్తానని, సంక్రాంతి లోగా సమస్యను పరిష్కరించాలని, లేకపోతే నిరాహార దీక్ష చేస్తానని అన్నారు. ప్రస్తతం అయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం గా మారాయి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here