టిఆర్ఎస్ ప్రచారానికి బిత్తిరి సత్తి ఎంత తీసుకున్నాడో తెలిస్తే షాక్ అవుతారు!

0
142
మరొక నాలుగు రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ప్రధాన పార్టీలు అన్నీ కూడా విపరీతంగా ప్రచారం పై దృష్టిపెట్టి ప్రజల్లోకి వెళుతూ తమ వాణిని వినిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికల్లో ఒంటరిగా బరిలో నిలిచిన టీడీపీ, కాంగ్రెస్ లు ఇప్పుడు టిజెఎస్, సిపిఐ తో కలిసి మహాకూటమిగా ఏర్పడి టిఆర్ఎస్ పై ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ముందుకు సాగుతున్నాయి. అయితే మరోవైపు టిఆర్ఎస్ కూడా తమ ప్రచార జోరును పెంచుతోంది. ఇక అందులో భాగంగా కొన్నాళ్లుగా నిర్వహిస్తున్న సభల సహా, నిన్న చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ మహాకూటమిపై విరుచుకుపడ్డారు. అది కేవలం అధికార దాహంతో ఏర్పడిన కూటమి అని, కేవలం అధికారం, ధనార్జన కోసమే తన బద్ధశత్రువైన కాంగ్రెస్ తో చంద్రబాబు జతకట్టారని ఆయన మండిపడ్డారు. ఇకపోతే టిఆర్ఎస్ నాయకులు కూడా తమ పార్టీ తరపున తన వెరైటీ యాక్టింగ్ తో ప్రేక్షకుల్లో మంచి పేరు సంపాదించిన బిత్తిరి సత్తిని ప్రస్తుతం తమ పార్టీ తరపున ప్రచారం చేయిస్తున్నారు.
అయితే నిన్నటి చేవెళ్ల సభతో నాయకులను, ప్రజలను తన స్పీచ్ తో ఆకట్టుకున్న సత్తి, కొంత పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పైనా, అలానే చంద్రబాబు, బాలకృష్ణల పై కొన్ని విమర్శలు కూడా చేసాడు. అయితే ఇదివరకు ఎన్నికల్లో మధుప్రియ వంటివారిని రంగంలోకి దించిన టిఆర్ఎస్ పార్టీ, ఈ సారి సత్తితో ప్రచారాన్ని చేయిస్తోంది. అయితే సత్తి కూడా వారికి ప్రచారం చేయడానికి కాస్త ఎక్కువ మొత్తంలోనే డబ్బులు రెమ్యూనరేషన్ రూపంలో తీసుకున్నాడని అంటున్నారు. ఏది ఏమైనా తెలివిగా, దొరికినవి అందిపుచ్చుకుని, వాటితో ప్రజల్లోకి వెళ్లి, తరువాత వారి మన్ననలతో విజయం సాధించినవారిదే అధికారం. ఈ విధంగా ఆలోచన చేయడంలో కేసీఆర్ ఎప్పుడు ముందే వుంటారు అనడానికి ఇదొక నిదర్శనమని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here