లక్ష్మీస్ ఎన్టీఆర్ లో బొమ్మాళి సాంగ్.. వైరల్ అవుతున్న వీడియో!

0
58
సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయింది. ఇక ఇప్పటికే ఈ సీన్మాలోని వెన్నుపోటు సాంగ్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన రావడంతో త్వరలోనే సినిమాని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇకపోతే ఈనెల ఫిబ్రవరి 14 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు వర్మ. వాడిగా, వేడిగా, సూటిగా ఉండటంతో ఇందులోని పాటలకు ప్రేక్షకుల నుండి మంచి హైప్ వచ్చింది.
Image result for lakshmis ntr
ఇక కాసేపటి క్రితం ఇందులో గర్జన, సింహ గర్జన అనే సాంగ్ ప్రోమోను వర్మ రిలీజ్ చేసారు. అయితే ఈ సాంగ్ ను డబ్బింగ్ ఆర్టిస్ట్ బొమ్మాళి రవి పాడటం విశేషం. సిరాశ్రీ రాసిన పాటను బొమ్మాళి రవి పాడాడు. ఈ పాటకు సంబంధించిన చిన్న వీడియోను వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.  ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here