సర్జరీ తరువాత మనవడితో కలిసి ఎంజాయ్ చేస్తున్న బ్రహ్మానందం….. వైరల్ అవుతున్న పిక్!

0
105
ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం ఇప్పటికే టాలీవుడ్ లో దాదాపుగా 1000 పైగా సినిమాల్లో నటించి తెలుగు ప్రజల మనస్సులో తనదైన చెరగని ముద్ర వేసుకున్నారు. ఇకపోతే ఇటీవల తనకు ఛాతిలో అస్వస్థత కారణంగా బ్రహ్మానందంకు హార్ట్ సర్జరీ చేయాలనీ వైద్యులు సూచించడంతో ఆయనకు కొద్దిరోజుల క్రితం ముంబైలోని ఏషియన్ ఆసుపత్రిలో హార్ట్ కు శస్త్ర చికిత్స నిర్వహించారు.
అయితే చికిత్స అనంతరం ఆయనను హైదరాబాద్ షిఫ్ట్ చేసారు కుటుంబసభ్యులు. ఇకపోతే నిన్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రహ్మానందంను కలిసి అయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలిపారు. ఇక కాసేపటి క్రితం బ్రహ్మానందం తన మనవడితో కలిసి హాయిగా ఆడుకుంటున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విడుదలయి హల్ చల్ చేస్తోంది. ఇక ఫోటోని బట్టి చూస్తే, బ్రహ్మానందం గారు చాలా వరకు కోలుకున్నట్లేనని, ఇక అతిత్వరలో అయన మళ్ళి మనల్ని గిలిగింతలు పెట్టి నవ్వించడం ఖాయమని, పలువురు నెటిజన్లు ఆయనకు అభినందనలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here