పిల్లుల … రాజ్యం అక్కడ పిల్లులు రాజులూ ……

0
32

మనం పిల్లి ఎదురైతే అపశకునం భావిస్తాం. కానీ, ఒక ఊరిలో మాత్రం సెకనుకో పిల్లి ఎదురవుతుంది. అయినా కూడా ఆ ఊరిలో ఎలాంటి ప్రమాదాలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. ఇంతకీ ఈ పిల్లుల ప్రపంచం ఎక్కడ ఉందొ తెలుసుకోవాలనివుందా? అయితే తైవాన్ లోని రుయిఫంగ్ జిల్లాలోని హౌదంగ్ కు వెళ్లశిందే.

జంతు ప్రేమికులకు ఈ ప్రాంతం భలే నచ్చేస్తుంది. ఇక్కడ ఎక్కడ చుసిన పిల్లులే కనిపిస్తాయి. ఇక్కడ క్యాట్ రూపంలో నిర్మించిన  `వాక్  వే ` కూడా భలే ఆకర్షణీయంగా ఉంటుంది.  ఇక్కడ ఎక్కడ చుసిన థీమ్ రెస్టారెంట్ లు కనిపిస్తాయి. వారు పిల్లులను తరిమేయకుండ  బల్లలు, కుర్చీలలో కూర్చోబెడతారు. 1900 సంవత్సరంలో ఈ ప్రాంతంలో మైనింగ్  జరిగేదట, ఇక్కడ ఆరు వేలమందికి పైకా నివశించేవారట.

1990లో సంవత్సరం నుంచి ఎక్కడ మైనింగ్ నిలిచిపోయింది. ఆ కారణం చేత ఇక్కడ జనాభా తగ్గి.. పిల్లుల సంఖ్యా పెరగడం మొదలైనది. అయితే, ఇక్కడి ప్రజలు పిల్లులను తరిమేయకుండా అక్కున  చేర్చుకొని సొంత పిల్లల కంటే ఎక్కువగా చూసుకుంటారు. ఈ పిల్లుల వల్లే ఆ ప్రాంతానికి పేరొచ్చింది. ప్రస్తుతం ఆ గ్రామంలో 286 పిల్లులు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here