ఒరిజినల్ ఆధార్ కార్డు కావాలనుకునేవారికి సులువైన మార్గం తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం

0
66
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డును తప్పనిసరి చేయడంతో దాదాపుగా ప్రజలందరూ ఈ కార్డును అప్లై చేసుకుంటున్నారు. అయితే కార్డు ఒకసారి వచ్చిన తరువాత అందులో ఏమైనా తప్పులు దొర్లితే, వాటిని అప్డేట్ చేసి సరిచేసుకుంటున్నారు. ఇంతవరకు బాగుంది. కానీ మార్పులు చేర్పుల కోసం అప్లై చేసుకున్న కొద్ది రోజుల తర్వాత మీసేవా కేంద్రాలకో, ఆధార్‌ కేంద్రాలకో వెళ్లి మనమే డౌన్‌లోడ్‌ చేసుకుంటాం. ఇవి కొంత నాసిరకంగా, మునుపటి వాటితో పోల్చితే చాలా పల్చగా ఉంటాయి. అయితే ఇక నుంచి ఆధార్‌ ‘ఒరిజినల్‌’ కార్డులను నేరుగా యూఐడీఏఐ వెబ్ సైట్ నుంచే పొందవచ్చు.
Image result for aadhar card
ఆధార్‌కార్డు ప్రవేశపెట్టిన తొలినాళ్లలో పోస్టులో ఇంటికి పెద్ద కార్డులు వచ్చేవి. గుర్తుంది కదా, ఇప్పుడూ అలానే వస్తాయన్నమాట. పైలట్‌ ప్రాజెక్టుగా యూఐడీఏఐ దీనిని మళ్లీ చేపట్టింది. ఆధార్‌ కేంద్రాలు, మీసేవా కేంద్రాల్లో తీసుకున్న కార్డులుచెల్లుబాటు అయినా.. భద్రతా కారణాల రీత్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికితోడు.. ‘ఒరిజినల్‌’కు డిమాండ్‌ అధికంగా ఉందని యూఐడీఏఐ అధికారి ఒకరు తెలిపారు. అయితే ఈ సదవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాలని, ఇక తమ వెబ్ సైట్ లోకి వెళ్లి, ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఒక రూ.50 రుసుము చెల్లిస్తే కార్డు నేరుగా మన ఇంటికి పోస్ట్ లో వస్తుంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here