ఎన్టీఆర్ గారికి భారతరత్న రాకుండా అడ్డుకుంది చంద్రబాబు : ప్రముఖ నిర్మాత షాకింగ్ కామెంట్స్!  

0
48
ఓ వైపు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీలు తమ మ్యానిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్లేందుకు విస్తృతంగా ప్రణాళికలు రచిస్తున్నాయి. అయితే ఇప్పటికే అక్కడ అధికార పక్షమైన టిడిపి మీద పలువిధాలుగా నెగటివ్ ఇమేజి రోజురోజుకు పెరిగిపోతోంది. ఇకపోతే నేడు  ప్రముఖ దర్శకనిర్మాత, రాజకీయ విశ్లేషకుడు తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలని పదేపదే డిమాండ్ చేస్తున్నా, చంద్రబాబే దానిని అడ్డుకుంటున్నారని, దాని వెనక ఉన్న అంశాలను ఒక యూట్యూబ్ చానల్‌ ద్వారా విశ్లేషించారు. అయన మాట్లాడుతూ, రిపబ్లిక్ డే రోజున ప్రకటించిన పురస్కారాల్లో ఎన్టీరామారావు పేరు లేకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారని, కానీ ఎందుకో ఈ విషయంలో తనకు ఆయనపైనే అనుమానం ఉందని పేర్కొన్నారు. నాలుగున్నరేళ్లు ఎన్డీయేతో జతకట్టిన చంద్రబాబుకు ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇప్పించడం పెద్ద విషయం కాదని,
Image result for ntr chandrababu
అయితే అవార్డులు ప్రకటించేంత వరకు సైలెంట్‌గా ఉండి, ఆ తర్వాత హడావుడి చెయ్యడం వెనక పెద్ద స్టోరీనే ఉందని అనిపిస్తోందని తమ్మారెడ్డి అన్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటిస్తే దానిని ఆయన భార్య లక్ష్మీపార్వతి అందుకోవాల్సి ఉంటుందని, కావున ఆ పురస్కారాన్ని లక్ష్మీపార్వతి అందుకోవడం వీరికి ఇష్టం లేదని, అందుకనే కావాలనే జాప్యం చేస్తున్నట్టు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. అయితే ఎన్టీఆర్ గారికి  భారతరత్న వద్దనుకుంటే దానిని అక్కడితో వదిలేయాలి కానీ ఈ రాద్ధాంతం ఎందుకని భరద్వాజ ప్రశ్నించారు. నిజానికి ఈ అనుమానం కేవలం తనకు మాత్రమే కాదని, సినిమా మరియు రాజకీయ ప్రముఖులు చాలా మందిలో ఉందని అయన స్పష్టం చేసారు….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here