షర్మిల ఆరోపణలపై చంద్రబాబు ఫైర్…. ఏమన్నారంటే?

0
76
కొన్ని రోజులుగా వైసిపి అధినేత సోదరి షర్మిల మరియు, యంగ్ హీరో ప్రభాస్ కు మధ్య సంబంధం వుందని, అలానే వారిద్దరూ అప్పట్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ పలు మీడియా వర్గాల్లో వార్తలు షికారు చేసిన విషయం తెలిసిందే. నిజానికి గత ఎన్నికల సమయంలో ఈ వార్తలు మరింతగా శృతిమించడంతో అప్పట్లో షర్మిల పోలీసులను ఆశ్రయించి ఈ పుకార్లను సృష్టించిన వారు ఎవరో కనుక్కుని వాటికీ అడ్డుకట్ట వేయాలని కోరారు. అయితే ఆ తరువాత కొన్నాళ్లపాటు అవి ఆగిపోయాయి. ఇక మళ్ళి ఇన్నాళ్లకు అవే పుకార్లు శృతిమించడంతో మొన్న షర్మిల హైదరాబాద్ పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ ను కలిసి ఈ పుకార్లు అసలు లేవనెత్తింది ఎవరో, వారిని పట్టుకుని కఠినంగా శిక్షించి, తనకు రక్షణ కల్పించాలని,
Image result for sharmila chandrababu
ఇది ఒకరకంగా టీడీపీ నాయకుల కుట్ర అంటూ కొన్ని పరోక్ష విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయమై నిన్న మాట్లాడిన ఏపీ సియం చంద్రబాబు, షర్మిల పరోక్షంగా తమపై లేనిపోని విధంగా నిందలు వేస్తున్నారని, ఎప్పుడూ కూడా తమ పార్టీ నాయకులెవ్వరూ కూడా ఆమెకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, అయినా ఎవరో ఏదో చేసిన దానికి షర్మిల మా పార్టీ వారిని తప్పుపట్టడం సరైనది కాదని ఆయన అన్నారు. అయినా మీరు ఏపీ వారు అయి ఉండి తెలంగాణ పోలీస్ కమీషనర్ కు ఎలా ఫిర్యాదు చేస్తారని ఆమెను ప్రశ్నించారు. కాగా ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here