ఎన్టీఆర్ పాత్రలో చంద్రబాబు మనుమడు? 

0
64
ఇప్పటికే విశ్వ విఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా విడుదలై పర్వాలేదన్పించింది. అయితే ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో త్వరలో రాబోయే సెకండ్ పార్ట్  ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ సినిమాని ఎలాగైనా హిట్ చేయాలనే తలంపుతో ఆ చిత్ర యూనిట్ ఎన్నో వ్యయప్రయాశలతో పని చేస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్, ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.
Image result for దేవాన్ష్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్, ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించినట్లు తెలుస్తోంది. గత వారమే దేవాన్ష్‌ కి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశారట. ప్రస్తుతం ‘మహానాయకుడు’ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఇకపోతే మహానాయకుడు స్క్రిప్ట్ లో చాలా మార్పులు చేశారని, అలానే కొన్ని ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ను యాడ్ చేస్తూ మహానాయకుడుని తెరకెక్కించారట క్రిష్. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్ బి కె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్, విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్ మరియు రాజకీయ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here