చంద్రబాబు పై నాగబాబు పొదుపు కథ…… మ్యాటర్ ఏంటంటే?

0
75
గత కొద్దిరోజలుగా యువరత్న బాలకృష్ణపై తన మాటల తూటాలతో విరుచుకుపడుతున్న మెగా బ్రదర్ నాగబాబు, ఇటీవల చంద్రబాబు తనయుడు లోకేష్ చేసిన ఒక తప్పుడు వ్యాఖ్యపై కూడా తన స్టయిల్లో పోస్ట్ చేస్తూ సమాధానం ఇచ్చారు. ఇక నేడు అయన ఏకంగా ఏపీ ముఖ్యమంత్రి
 చంద్రబాబుని టార్గెట్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టారు. కొన్నాళ్ల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నోరుజారిన ఓ మాటను తీసుకొని సెటైర్ వేశారు నాగబాబు. ‘ఈరోజు భారత దేశం మొత్తం మీద ఒకసారి చూస్తే.. అవినీతిలో కానీ.. అభివృద్ధిలో కానీ మొదటి స్థానంలో ఉన్నాం’ అని చంద్రబాబు ఓ సందర్భంలో మాట తూలారు.
Image result for chandrababu and nagababu
ఈ డైలాగ్ పై నాగబాబు ప్రజలకు సవాల్ విసిరారు. చంద్రబాబు చేసిన ఈ ప్రకటనలో ఒక నిజం ఉంది అలానే ఒక అబద్ధం ఉంది చెప్పుకోండి చూద్దాం అంటూ ప్రజలను ప్రశ్నించారు. చివరగా సమాధానం దొరకకపోతే తానే చెబుతానంటూ పైన ప్రశ్నకు నాగబాబు వివరణ ఇచ్చారు. ‘అవినీతిలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 అన్నది నిజం. ఇక అభివృద్ధిలో నంబర్ వన్ అనేది అబద్ధం’ అంటూ నాగబాబు ముగించారు. ఇంతకంటే గొప్పగా పొడుపు కథలు వేసేవారు, నిజాయితీగా చెప్పేవారు ఎవరుంటారంటూ చంద్రబాబుకు పరోక్షంగా నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యలు కొంత వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here