ప్రముఖ టాలీవుడ్ సీనియర్ నటుడి దీన స్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు!

0
160
సినీ నటుల్లో కొందరు తాము సంపాదించిన డబ్బు మరింత పెంచాలని సినిమాలు నిర్మించడం, అలానే పలు రకాల బిజినెస్ సంస్థల్లో, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం ఎక్కువగా చేస్తుంటారు. అయితే అలా నిర్మాతలుగా మారి సినిమాలు తీసి, వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి మరింత ధనార్జన చేసినవారు కొందరైతే, మరికొందరు మాత్రం ఆ డబ్బును పోగట్టుకుని పూర్తిగా నష్టపోయి చివరికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు కూడా లేని పరిస్థితికి వచ్చినవారు కొందరున్నారు. ఇక ప్రస్తుతం అటువంటి జీవితాన్ని గడుపుతున్నారట ఒకప్పటి సీనియర్ నటుడు చంద్రమోహన్. నిజానికి అప్పట్లో దాదాపుగా అందరూ సీనియర్ నటులతో నటించిన చంద్రమోహన్, ఆ తరువాత అప్పటి ప్రముఖ కథానాయికల సరసన కొన్ని సినిమాల్లో హీరోగా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు చంద్రమోహన్. ఇకపోతే కొన్నేళ్ల క్రితం అయన భార్య వసుంధర కొన్ని బోగస్ వ్యాపార సంస్థలు నెలకొల్పి వాటిని చివరకు దివాళా సంస్థలుగా మార్చిందని అయన కుటుంబంపై అప్పట్లో కొన్ని వార్తలు వచ్చాయి. అయితే ఆ తరువాత వాటినుండి కొంత తేరుకున్న చంద్రమోహన్, ఆ తరువాత మిగిలిన డబ్బులను వివిధ వ్యాపారాల్లో పెట్టడం జరిగిందని, నిన్నమొన్నటివరకు కాస్త పర్వాలేదనిపించిన అయన వ్యాపారాలు కొన్నాళ్ల క్రితం పూర్తిగా దివాళా తీశాయని సమాచారం.
ఇక దానితో చంద్రమోహన్ కుటుంబం పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయిందని, అదీకాక అప్పులు తీర్చడానికి ఆయనకున్న ఆస్తులు కూడా సరిపోక, ఆ ఆవేదనతో అసలే డయాబెటిస్ మరియు బిపి గల చంద్రమోహన్ కొంత మంచం పట్టరాని వినికిడి. కాగా ప్రస్తుతం అయన కుటుంబం తినడానికి తిండికూడా లేని పరిస్థితిని ఎదురుకుంటోందని, నిన్న మొన్నటివరకు అడపాదడపా అక్కడక్కడా సినిమాల్లో నటించిన చంద్రమోహన్, ప్రస్తుతం ఇటువంటి పరిస్థితి రావడంతో మరోవైపు అవకాశాలు కూడా లేక ఎంతో మనోవేదనకు గురవుతున్నారట. అయితే అయన పరిస్థితిని తెలుసుకున్న కొందరు పెద్దనటులు, అయన ఇంటికివెళ్ళి తమవంతు సాయం అందిస్తున్నారని సమాచారం. ఇక ఈ విషయం తెలుసుకున్న కొందరు నెటిజన్లు అయన పరిస్థితిపై జాలిపడుతూ సోషల్ మీడియా వేదికల్లో వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here