పూరి విషయంలో అలిగిన చార్మీ… మ్యాటర్ ఏంటంటే?

0
95
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇటీవల కొద్దికాలంగా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల అయన తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కించిన మెహబూబా సినిమ  ఫ్లాప్ కావడంతో తదుపరి తాను రామ్ తో తీయబోయే ఐస్మార్ట్ శంకర్ సినిమాపైనే అయన ఆశలు పెట్టుకున్నాడు. ఇక మరోవైపు రామ్ కి కూడా సరైన సక్సెస్ లేకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తీరాలని ఇద్దరూ ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో హీరో రామ్ దర్శకుడు పూరికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు. అదేమిటంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కాఫీ పొడి. ఇకపొతే దాని పేరు కోపీ లువాక్, అయితే ఈ విషయాన్ని తెలుపుతూ పూరి ట్వీట్ చేశాడు. దీని గురించి గూగుల్‌లో వెతకండి అని పేర్కొన్నాడు. ఇక  పూరి చేసిన ఈ ట్వీట్ చూసి, రామ్ తనకెందుకు గిఫ్ట్ ఇవ్వలేదనట్లుగా అప్‌సెట్ అవుతూ ‘షిట్ షిట్ షిట్’ అని కామెంట్ చేసింది ఛార్మి. ఇక ప్రస్తుతం ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here