జూనియర్ బాహుబలి ఇప్పుడెలా వున్నాడో చూస్తే ఆశ్చర్యపోతారు!

0
135
సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులుగా చేసి తరువాత పెరిగి పెద్దయి, హీరోలు మరియు హీరోయిన్లుగా మారినవారు ఎందరో వున్నారని చెప్పుకోవాలి. వారిలో దివంగత శ్రీదేవి, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, వరలక్ష్మి, రోజా రమణి, తరుణ్, రాశి, తులసి వంటి ఆర్టిస్టులు చిత్రసీమలో మంచి పేరు సంపాదించారు. ఇకపోతే  దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో చిన్నప్పటి ప్రభాస్ పాత్రలో నటించిన మాస్టర్ నిఖిల్ మనకు అందరికి గుర్తువుండేవుంటాడు. ఎందుకంటే ఆ సినిమాలో నిఖిల్ కనిపించేది చాలా తక్కువ సమయం అయినా, సినిమాలో అతడు నటించిన సన్నివేశాలు ఇప్పకిటీకీ ప్రేక్షకుల మదిలో గుర్తుండిపోతాయి అనే చెప్పుకోవాలి. నిజానికి ఆ సినిమాకు సంబంధించి చైల్డ్ ఆర్టిస్ట్ కోసం ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో నిఖిల్ తనకు డాన్స్ నేర్పించిన ఒక డాన్స్ మాస్టర్ ద్వారా ఆ ఆడిషన్స్ కు వెళ్ళాడు, అయితే అతడి రూపం మరియు నటన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కు బాగా నచ్చడంతో అయన వెంటనే, ఈ కుర్రాడు బాగున్నాడు, బాహుబలి చిన్నప్పటి పాత్రకు చక్కగా సరిపోతాడు అంటూ అతడిని ఎంపిక చేశారట. అలా నిఖిల్, ని ఆ అవకాశం వరించింది. రాజమండ్రి దగ్గరి దెందులూరు నిఖిల్ స్వస్థలం. చిన్నప్పటి నుండి మంచి డాన్సర్ అయిన నిఖిల్ ని ఎప్పటికైనా సినిమాల్లోకి తీసుకురావాలనేది అతని అమ్మ, నాన్నల కల అట.
అయితే ఒకానొక సమయంలో ఒక మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న నిఖిల్ అనుకోకుండా ఒక సినిమా అవకాశం రావడంతో అక్కడినుండి చైల్డ్ ఆర్టిస్ట్ గామారాడు. ఆ సినిమానే ఆది, శాన్వి నటించిన లవ్లీ. ఆ సినిమాలో బి జయ, మంచి డాన్స్ తెలిసిన చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతుకుతుండగా, నిఖిల్ ఫోటోను ఆమె చూడడం, వెంటనే అతడిని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేయడం జరిగిపోయాయట. అలా మెల్లగా అవకాశాలు అందిపుచున్న నిఖిల్ బాహుబలి సహా దాదాపుగా 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ప్రస్తుతం డిగ్రీ విద్యను అభ్యసిస్తున్న నిఖిల్, తనకు ఇండస్ట్రీలో ఎన్టీఆర్, ప్రభాస్ అంటే చాల ఇష్టమని చెప్తున్నాడు. అంతేకాదు అతడు ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ, తనకు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి అనుకోకుండా చేజారిందని ఆ విషయమై నిఖిల్ ఎంతో బాధ పడ్డాడట. ఇకపోతే ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని సినిమాల్లో నటిస్తున్న నిఖిల్, పెద్దయ్యాక హీరోని అవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. కాగా ప్రస్తుతం మంచి అవకాశాలతో దూసుకెళ్తున్న నిఖిల్ గురించి విన్న పలువురు నెటిజన్లు, అతనికి అల్ ది బెస్ట్ నిఖిల్ అంటూ సోషల్ మీడియా వేదికల్లో కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here