రకుల్ ప్రీత్ పోస్ట్ పై సింగర్ చిన్మయి షాకింగ్ కామెంట్స్….!

0
90
నిన్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వేసుకున్న డ్రెస్ పై ఒక నెటిజన్ కొంత వల్గర్ గా కామెంట్ చేయడంతో, రకుల్ వెంటనే అతడిపై విరుచుకుపడుతూ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ వర్గాల్లో అలానే సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇక నేడు ఈ మ్యాటర్ పై ట్విట్టర్ వేదికగా స్పందించారు సింగర్ చిన్మయి శ్రీపాద. అయినా ఒక అమ్మాయి తనకు అన్యాయం జరుగుతుందని చెబుతుంటే, అందరూ అండగా నిలవాల్సింది పోయి విమర్శించడమేంటని ప్రశ్నించింది. సోషల్ మీడియా ద్వారా మనల్ని విమర్శించేందుకు ఈ రకం మనుషులు చాలా మందే ఉంటారు. వాళ్ళు అసభ్యకరంగా సందేశాలు పంపినా మనం మాత్రం సౌమ్యంగా ఉండాలి.
Image result for rakul preet singh chinmayi sripadha
ఇలాంటి వెధవల్ని సార్, అన్నా అంటూ సంబోధించాలి. అసలిలాంటి మనుషులు ఎందుకు బ్రతికుంటారో నాకైతే అర్థం కావటం లేదు. ఇలాంటివి చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. నేను ఓ గాయని అయినప్పటికీ అత్యాచారం చేస్తామంటూ ఎన్నో ట్వీట్లు చేస్తున్నారు కొందరు నీచులు. ఏదో మహిళల్ని తమకు రాసిచ్చేసినట్లు చాలా మంది బిహేవ్ చేస్తున్నారు అని ట్వీట్‌లో పేర్కొంది చిన్మయి. ఆ తర్వాత నాకు, రకుల్‌కి, ఇతర మహిళలకు ప్రతీ రోజూ వచ్చే ఇలాంటి చెత్త సందేశాలు అగనంతకాలం మహిళలపై వేధింపులు తగ్గవని, కాబట్టి ఇకనైనా ప్రతి మహిళ మన ఇంట్లో అమ్మ, అక్క, చెల్లి వంటిదే అని భావించి కామెంట్ చేయాలనీ చిన్మయి కోరింది. కాగా ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం విపరీతంగా వైరల్ గా మారాయి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here