ఎన్నికల ప్రచార బరిలో మెగాస్టార్ చిరంజీవి

0
21

సినీ నటుడు , కేంద్ర  మాజీ మంత్రి చిరంజీవి ఎన్నికల ప్రచారం లో పాల్గొంటున్నారు .అయితే చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన పార్టీ తరఫునుండి ప్రచారం చేస్తారని అందరు భావించినా సరే పవన్ కు షాకిచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రకటించారు . చేవెళ్ల ఎంపీ అభ్యర్హి కొండా విశ్వేశ్వర్ రెడ్డి తరపున ఈ ప్రచారం చేస్తారని తెలిపారు .

 ఈ నెల 8 న జరిగే ప్రచారసభలో సోనియా గాంధీ మరియు చిరంజీవి ఇద్దరు కలిసి ప్రచారం లో  పాల్గొంటారని  వీరు చెప్పుకొచ్చారు . చిరు గత కొద్దీ కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్న విషయం అందరికి తెలిసిందే . ఎట్టకేలకు ఒక ప్రచారానికి  చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే తెలుస్తుంది . ఎపి లో కాంగ్రెస్ తరపున ప్రచారానికి విముఖుతం చూపిస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు ఎపి నేతలు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here